YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీబీఐకి కర్ణాటక రెడ్ సిగ్నల్..

సీబీఐకి కర్ణాటక రెడ్ సిగ్నల్..

బెంగళూరు, సెప్టెంబర్ 27,
సీబీఐకి కర్ణాటక ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేసింది. సడెన్‌గా ఎందుకీ డెసిషన్‌…? రాష్ట్రంలోని కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో సిద్ధరామయ్యపై ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కాం ఎఫెక్టేనా..? అన్న చర్చ మొదలైంది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ముఖ్యమంత్రి తన సొంతవాళ్లకు ఇష్టం వచ్చినట్లు స్థలాలు కేటాయిచారంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక భూభూగంలోకి ఎంటరవ్వొద్దంటూ సీబీఐకి రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐ అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ స్పష్టం చేశారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు బహిరంగ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. సీబీఐ దుర్వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐకి రిఫర్ చేసిన అన్ని కేసులలో ఇప్పటివరకు ఛార్జిషీట్లు దాఖలు చేయలేదని, చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. తాము పంపిన అనేక కేసులను దర్యాప్తు చేయడానికి సీబీఐ నిరాకరించిందని, ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయన్నారు. సీబీఐ పక్షపాతంతో ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. ఇది ముడా కేసుతో సంబంధం లేదని, సీబీఐ తప్పుదారి పట్టకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి హెచ్‌కే పాటిల్‌ స్పష్టం చేశారు.సీబీఐ అనుమతి రద్దుకు ముడా స్కాంకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు. సీబీఐ పక్షపాత వైఖరితో పనిచేస్తున్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బీజేపీ ఏం చెబితే సీబీఐ అదే చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మరో కీలక నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. తమ అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన సమాచారాన్ని అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

Related Posts