YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీకి రేవంత్ రెడ్డి నివాళులు

కొండా లక్ష్మణ్ బాపూజీకి రేవంత్ రెడ్డి నివాళులు

హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. తెలంగాణ కోసం తపించిన బాపూజీ అడుగుజాడల్లో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన సేవలు నిరంతరం గుర్తుండాలన్న లక్ష్యంతోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

Related Posts