YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది.  అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 4న ఉదయం 5:45 గంటలకు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12న రాత్రి 10:30 గంటలకు ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
4న ధ్వజారోహణం, పాద సేవ వాహనం ,  5న చిన్న శేష వాహనం, హంస వాహనం,  6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్ప వృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 8న మోహిని అవతార వాహనం, గరుడసేవ,
9న హనుమంత వాహనం, “బంగారు రథం”, గజవాహనం,  10న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 11న రథోత్సవం, అశ్వ వాహనం, 12న చక్రస్నానం, ధ్వజరోహణం నిర్వహించనున్నారు.
రాకపోకలపై నిషేధం..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ.. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనుంది

Related Posts