YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టండి

ప్రభుత్వ కార్యాలయాల్లో  సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టండి

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు డివిజన్ మండల అధికారులకు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది.
అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో ముఖ్యమంత్రి కొత్త ఫోటో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టాలని తెలిపింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది.
దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదే శించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం.

Related Posts