YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ నియామకాలు

రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ నియామకాలు

వరంగల్
తమరిని అడిగేవారు ఎవరు అన్న ధీమానో ఏమోగానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ నియామకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలోని ఖాళీలను ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ ప్రక్రియను గతంలో చేపట్టి భర్తీ చేసింది. ఆ క్రమంలో వరంగల్ పోర్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఖాళీ ఉందన్న కారణంతో ఓ వ్యక్తిని ఔట్సోర్సింగ్ విధానం ద్వారా అప్పట్లో భర్తీ చేసింది. అతను అనారోగ్య కారణాలతో కార్యాలయంకు వెళ్లకపోవటంతో దాన్ని సాకుగా తీసుకున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా ఆ ఖాళీని భర్తీ చేయడం పై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఖాళీల భర్తీపై ప్రకటన చేసినట్లయితే వాటిని ప్రజలకు చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆ ఖాళీని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ భర్తీ చేసింది. జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న పరిస్థితుల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఖాళీల భర్తీ కోసం ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోర్టు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భర్తీ చేసిన ఆ వ్యక్తికి ఉన్న అర్హతలు తమకు లేవా అంటూ అధికారుల తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నియామకం వెనుక రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల హస్తం ఉందని నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ భర్తీ వెనుక జరిగిన తతంగం ఏమిటని ప్రజలు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోర్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న ఖాళీని భర్తీ చేయడం కోసం చేపట్టినప్పటికీ అతను వరంగల్ రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేయడంపై ప్రజల అనుమానాలకు బలం చేయకపోయినట్లు అయిందని నిరుద్యోగులు అంటున్నారు. వరంగల్ పోర్టు కార్యాలయంలో గతంలో పనిచేసిన వ్యక్తికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటీవల భర్తీ చేసిన అక్రమ ఉద్యోగ నియామకాలను నిలుపుదల చేయాలని నిరుద్యోగులు ప్రజలు ప్రజాసంఘాల నాయకులు అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయాల్సిన వారు సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు విధులు నిర్వహించడం పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పనిచేసిన ఉద్యోగులు కార్యాలయంలో అనేక అవినీతి అక్రమ కార్యక్రమాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.ఐనా అధికారులు వాటిని విస్మరించి కార్యాలయంలో వారికి స్థాయిని మించిన పనులు అప్పగించడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది.

Related Posts