YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జగన్ తీరు హిందుత్వంపై దాడి

జగన్ తీరు హిందుత్వంపై దాడి

హైదరాబాద్
బండ్లగూడ జాగీర్ లో శ్రీ విద్యారణ్య నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రసంగించిన బండి సంజయ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ పై రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గు చేటన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా తిరుమల డిక్లరేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనడుగుతున్నా అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ప్టపఇ నుండో ఉంది. కొత్తగా పెట్టిన నిబంధన కాదు... అట్లాంటి తిరుమలకు క్రిస్టయన్ అయిన జగన్ వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి? తిరుమలకు వచ్చేసరికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా? గతంలో పూరి ఆలయానికి వెళితే ఇందిరాగాంధీ పార్శి మతస్తుడిని పెళ్లి చేసుకుందని రానివవ్వలేదు. నేపాల్ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళిన సోనియాగాంధీ క్రిస్టియన్ కాబట్టి రానివ్వలేదు. అంత మాత్రాన దాడి జరిగినట్లా?’’అని ప్రశ్నించారు. ‘‘నేనడుగుతున్నా,.. బొట్టు పెట్టుకుని టోపీ పెట్టుకోకుండా నమాజ్ చేయబోమని మక్కా మసీదుకు హిందువులు వెళితే అనుమతిస్తారా? ప్రార్ధనలు చేయకుండా వాటికన్ సిటీ, జెరూసలెంకు హిందువులు వెళతానంటే ఒప్పుకుంటారా? తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు. జగన్ తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అన్పిస్తోంది. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉంది.’’ అని పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని మదర్సాలో 9 మంది ఉగ్రవాదులను పట్టుకున్నారు.  ఉగ్రవాదానికి బీజాలు వేస్తున్నట్లు గుర్తించిర్రు. అట్లాంటి మదర్సాలకు సాయం చేస్తున్నరు. మరి శిశు మందిర్ కు ఎందుకు సాయం చేయరు? హిందువులారా... మీరంతా గుండెపై చేయి వేసుకోవాలి. శిశు మందిర్ ల అభివ్రుద్దికి ప్రతి ఒక్క హిందూ తన వంతు సాయం చేయాలి. పిల్లలను దేశభక్తులుగా తీర్చిదిద్దేందుకు పాటుపడాలి.
హైదరాబాద్ బండ్ల గూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు లింగం సుధాకర్ రెడ్డి, ట్రస్ట్ ఛైర్మన్ అర్జున్ గౌడ్, సరస్వతి విద్యా పీఠం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, సీతారాం, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts