YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు

కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 30,
హైదరాబాద్ లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.826 కోట్లతో ఈ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది.హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు ఉంటాయని జీహెచ్ఎంసీ తెలిపింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుందని పేర్కొంది.రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్ లు నిర్మిస్తారు. ఇక సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్ లు అభివృద్ధి చేస్తారనివివరించింది.ఈ నిర్మాణాల వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్ గూడా ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయిని జీహెచ్ఎంసీ వివరించింది.ఫస్ట్  ప్యాకేజీలో భాగంగా రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేస్తారు. ఇక 2వ ప్యాకేజీలో రూ.405 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతారు
ఎయిర్ పోర్టు మెట్రోలో మార్పులు
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కీలక అడుగు ముందుకుపడింది. మెట్రో రెండో దశ పనులు అతిత్వరలోనే పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించిన డీపీఆర్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే మెట్రో సెకెండ్ ఫేజ్ డీపీఆర్‌ల తయారీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ.. కారిడార్ల అలైన్మెంట్ తో పాటు కీలకమైన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.ఈ క్రమంలో గతంలో నిర్ణయించిన ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్‌-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైనును ఖరారు చేసింది. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, మెట్రో రెండో దశ కారిడార్‌ల డీపీఆర్‌లను ఆమోదం తెలపనుంది. మొత్తం ఆరు కారికార్లలతో మెట్రో సెకెండ్ ఫేజ్ ఉండనుంది.
కారిడార్ 4.. నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవు.. ఎల్ బి నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, చంద్రాయన్ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా నేషనల్ హైవే మీదుగా ఈ మార్గం ఉంటుంది. మొత్తం 36.6 కిలీమీటర్ల పొడవులో, 35 కిలోమీటర్ల ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కిలీమీటర్ల మార్గం భూగర్భంలో వెళ్తుంది.
కారిడార్ 5.. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ ను పొడిగిస్తారు.కారిడార్ 6.. ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపు.. ఎంజీబీఎస్ నుండి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుండి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా చేర్చనున్నారు.
కారిడార్ 7.. ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపు.. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి, పటాన్‌చెరు వరకు ఉన్న ఈ 13.4 కిలీమీటర్ల లైన్ ఆల్విన్ X రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది.
కారిడార్ 8.. విజయవాడ హైవేపై ఎల్ బి నగర్ వైపు నుండి రెడ్ లైన్ పొడిగింపు.. ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది పార్తిగా ఎలివేటెడ్ కారిడార్‌లో సుమారు 6 స్టేషన్లు ఉంటాయి.
సీఎం ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డిపిఆర్ తయారు చేస్తున్నామని చెప్పారు మెట్రో ఎండీ… ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన డీపీఆర్ లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

Related Posts