YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ కథ అడ్డం తిరిగింది..

గులాబీ కథ అడ్డం తిరిగింది..

హైదరాబాద్, అక్టోబరు 3,
బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుక ధోరణిలో వ్యవహరిస్తుందా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరొకలా ఉంటుందా? మూసీ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో పునాదులు పడ్డాయా? కాంగ్రెస్ సర్కార్ కంటిన్యూ చేస్తోందా? ప్రజలను ఆకట్టుకునేందుకు వారి తరపున పోరాటం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మూసీ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ప్రజలకు అడ్డంగా దొరికిపోయింది. ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలు పోరాటమంతా డ్రామాగా తేలిపోతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం నాడు మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. 2017లో మూవీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పత్రాలకు బయటపెట్టారు మంత్రి. మూసీ నదికి 50 మీటర్లు బఫర్ జోన్ ఏర్పాటు చేసిందని వివరించారు. మూసీ ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్, ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు.సాక్షాత్తూ అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి  కేటీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు వత్తిదేనని తేలిపోయింది. దీని వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఆందోళన వెనుక కొంతమంది రియల్టర్లు ఉన్నారని కాంగ్రెస్ నేతలు బలంగా వాదిస్తున్నారు.. పదేపదే చెబుతున్నారు. ఇప్పుడదే నిజమైనట్టు కనిపిస్తోంది.కేటీఆర్ మాటల వీడియోలు చూస్తున్న మూసీ నిర్వాసితులు షాకవుతున్నారు. బీఆర్ఎస్ ఈ ద్వంద వైఖరేంటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వ్యవహారంపై ఇంకెన్ని వీడియోలు వెలుగులోకి వస్తాయో చూడాలి. మొత్తానికి మూసీ పుణ్యమాని బీఆర్ఎస్ ముసుగు ఓపెనవుతోంది.లంగాణలో ఏమూలకు వెళ్లినా ఎకరం భూమి 10 లక్షలకు తక్కువ లేదని, 20 లక్షలకు పైనే ఉందని చెబుతూ వచ్చారు KCR. మరి అంత లెక్కలు చెప్పిన గులాబీ బాస్.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనంతగిరి, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల ముంపు బాధితులకు, భూనిర్వాసితులకు పరిహారం ఈ లెక్కన భారీగానే ముట్టజెప్పి ఉంటారనుకునేరు. భూసేకరణ దగ్గర్నుంచి పరిహారం దాకా, పునరావాసం దాకా పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇంత చేసినా బాధితులకు దక్కింది అంతంతే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చామని నాటి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. సీన్ కట్ చేస్తే ఎకరాకు దక్కింది పది లక్షలోపే మరి. మాటల్లో చెప్పినదానికి చేతల్లో చేసిన దానికి చాలా గ్యాప్ ఉంది. నిర్వాసితులది ఒక్క గోస కాదు. ఎవరికీ సంపూర్ణంగా పరిహారం రాలేదు. చెప్పాలంటే జీవితాలు ఆగమయ్యాయి. ముంపు గ్రామాలను ఇప్పటికీ పట్టించుకోలేదు. వాళ్లను కదిలిస్తే రియాక్షన్ ఇదీ.
అంతే కాదు.. భూసేకరణ విషయంలో 2013 చట్టానికి మించిన ప్రయోజనాలను నాటి కేసీఆర్ సర్కారు కోర్టుల దగ్గర చెప్పుకుంది. బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరానికి 40 వేల నుంచి 50 వేల రూపాయలే ఉందని, కానీ తాము దయ తలిచి, పెద్ద మనసు చేసుకుని జీవో నెంబర్ 123 ప్రకారం ఒక ఎకరానికి 6 లక్షలు చెల్లించామన్నారు. పునరావాసంలో కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పించామన్నారు. అంతన్నారు.. ఇంతన్నారు. ఏదైనా గొంతెత్తి అడిగితే లాఠీఛార్జ్ లు, అరెస్టులు, కేసులు. ఇదే జరిగింది. ఎవరైనా భూసేకరణ కోసం వస్తుంటే వారి గుండెలు అదిరిపోయాయి. కాళేశ్వరం మూడో టీఎంసీ కోసమని వస్తే ఎదురుతిరిగిన సందర్భాలూ ఉన్నాయి. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూసేకరణ విషయంలోనూ అదే జరిగింది. నిర్వాసితుల నోటి నుంచి మాట రాకుండా చేశారు.నిర్వాసితులపై ఉన్నట్లుండి బీఆర్ఎస్ నేతలకు అతి ప్రేమ వెనుక ఏం జరుగుతోందన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై పెద్ద ఎత్తున సీరియస్ గా ఉద్యమించడానికి కారణాలు ఏమై ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరా తీశారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిలో 80 శాతం మంది బీఆర్ఎస్ నేతలే ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు? ఏ చెరువును కబ్జా చేశారు? అనే చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను సీఆర్ఫీఎఫ్ జవాన్లతో నిర్బంధించారని, ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

Related Posts