YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఛైర్మన్ పై కోర్టు బాణం...

ఛైర్మన్ పై కోర్టు బాణం...

విజయవాడ, అక్టోబరు 5,
ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.. కానీ ఆయన ఆమోదించలేదు. వీళ్లు వెయిట్‌ చేస్తున్నారు.. కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. వీళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయి. వెనక చాలా మంది క్యూలో ఉన్నట్లున్నారు. కానీ.. ఆయన మాత్రం.. ఊహూ… అస్సలు తగ్గనంటున్నారు. ఇదంతా ఎక్కడనేగా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం. ఇలా కాదని.. అవసరమైతే న్యాయపోరాటం చేసైనా తమ రాజీనామాల్ని ఆమోదించుకోవాలనేది ఆ ముగ్గురు ఎమ్మెల్సీల ప్లాన్‌.. మరి అది వర్కవుట్‌ అవుతుందా…? ఏపీలో టిట్‌ ఫర్ టాట్‌ పాలిటిక్స్‌ బాగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో వైసీపీ 38 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఉంది. శాసనసభలో 11 మందికే పరిమితమైనా.. మండలిలో మాత్రం వైసీపీదే ఆధిపత్యం. దీంతో ఏ బిల్లు పాస్‌ కావాలన్నా శాసనమండలిలో వైసీపీ సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సిన పరిస్థితి. వైసీపీ అధినేత జగన్‌ ఓడిన కొత్తలో ఎమ్మెల్సీలను చూసి మీరే నా బలం.. నా బలగం.. నాఆశ అన్నారు. కానీ.. పార్టీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.ఎవరి వెర్షన్లో వాళ్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలను పిల్లల కోడిలా రెక్కల కింద దాచుకుందామనుకున్న జగన్‌కు కూటమి నుంచి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలైంది. అలా ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ గూడు వీడి బయటకొచ్చేశారు. వైసీపీకి చెందిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామాల్ని ఆమోదించాల్సినది శాసనమండలి చైర్మన్‌. ఇక్కడే వారికి చిక్కొచ్చి పడింది. మండలి చైర్మన్‌గా వైసీపీ అధినేత జగన్‌ వీర విధేయుడు కొయ్యే మోషేన్‌ రాజు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు నేరుగా మోషేన్‌ రాజునే కలిసి రాజీనామాలు సమర్పించారు. రెండు నెలలుగా చైర్మన్‌ ఆఫీసు నుంచి రాజీనామాలు ఆమోదం పొందినట్లు ఎలాంటి ప్రకటన లేదు.ఆ సీట్లు ఖాళీ అయ్యాయంటేనే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ నిర్వహిస్తుంది. అప్పుడు టీడీపీకి చెందిన ఆశావహులకు మ్మెల్సీలుగా చాన్స్‌ దక్కుతుంది. అలా మెల్లగా వైసీపీ బలాన్ని మండలిలో తగ్గిద్దామనుకున్న కూటమి స్కెచ్‌కు వైసీపీ నేత, మండలి చైర్మన్‌ బ్రేక్‌ వేసినట్లయ్యింది. రాజీనామాలను ఆమోదించిఉంటే ఇప్పటికే మండలిలో సగం వైసీపీ సభ్యులు ఖాళీ అయ్యేవారని అంటున్నారు.ఏపీలో మండలి, ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం చూస్తే.. తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్‌ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల రిసిగ్నేషన్లే గుర్తుకొస్తున్నాయి. బీఆర్ఎస్‌ నుంచి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్‌ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి.. అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ స్పీకర్‌ను విన్నవించారు. కానీ అక్కడా ఎలాంటి స్పందనా లేదు. దీంతో కోర్టుకెక్కింది బీఆర్ఎస్‌.ఏపీ శాసనమండలి విషయంలో కూడా చైర్మన్‌ రాజీనామాలు ఆమోదించకుంటే తమకు న్యాయపోరాటమే గతి అని వైసీపీని వీడిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆలోచనలో పడ్డారు. కోర్టు మెట్లెక్కినా స్పీకర్‌, మండలి చైర్మన్‌లు రాజ్యాంగ బద్ధ వ్యవస్థల అధిపతులుగా ఉన్నారు. వారి విచక్షణపై ఆధారపడే ఆమోదించాలా, లేదా..? అనేది ఉంటుంది.గతంలో ఏపీ స్పీకర్‌ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా అంత త్వరగా ఆమోదం తెలపలేదు. ఒక కీలకమైన సమయంలోనే ఓకే చేశారు. అవసరమనుకుంటే రిజైన్‌ చేసినవారిని పిలిచి మాట్లాడి, ఒత్తిడి చేసే అధికారం కూడా మండలి చైర్మన్‌కు ఉంటుంది. ఈ ముగ్గురి రాజీనామాల కథ తేలే దాకా.. మిగిలిన వాళ్లు రాజీనామా చేసే పరిస్థితి లేదు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటికి వైసీపీకి శాసన మండలిలో బలం సేఫ్‌గా ఉన్నట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts