YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ ట్రాప్ లో విపక్షాలు

రేవంత్ ట్రాప్ లో విపక్షాలు

హైదరాబాద్, అక్టోబరు 5,
తెలంగాణ రాజకీయాల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టు విషయంలో ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. విదేశీ పర్యటనల్లోనూ నగరాల్లో ఉన్న నదులను .. వాటి నిర్వహణను పరిశీలించారు. అలాగే హైదరాబాద్‌లోనూ అభివృద్ధి చేయలనుకుంటున్నారు. కేవలం శుభ్రం చేయడం కాకుండా ఆ నది చుట్టూ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతి దశలోనూ ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్రమణలు తొలగించే దశలో ఉన్నారు. అయితే ఈ ఆక్రమణలు తొలగించే ముందు హైడ్రా కూల్చివేతలు సంచనలం రేపాయి. దాంతో తీవ్ర వివాదాస్పదమయింది.  రాజకీయ పార్టీల ఇంత కన్నా మంచి అవకాశం రాదన్నట్లుగా ఆక్రణల కూల్చివేత్లని అడ్డుకుంటామని వెళ్లి ప్రజలకు భరోసా ఇచ్చి వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన అడుగులు ముందుకు వేస్తున్నారు.  మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కొత్తది కాదు. భారత రాష్ట్ర సమితి సర్కారులోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆక్రమణల్ని గుర్తించారు. మూసిని సుందీరకరణ చేసేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని దానికి చైర్మన్ ను చేశారు. కానీ అడుగులు ముందుకు పడలేదు. రేవత్ రెడ్డి ఆ ప్రాజెక్టును లార్జర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే ఇప్పుడు ఆక్రమణల్ని కూల్చివేతను బీఆర్ఎస్ వ్యతిరేకించడం ప్రారంభించింది. బీఆర్ఎస్‌కు బీజేపీ కూడా జత కలిసింది. దీంతో ఆక్రమణదారుల వద్దకు వెళ్లి కూల్చి వేయనివ్వబోమని భరోసా ఇస్తున్నారు. కానీ గతంలో కేటీఆరే ఆక్రమణల్ని కూల్చివేయాలని ఆదేశిస్తున్న వీడియో కాంగ్రెస్ నేతలు వైరల్ చేశారు. మూసి ఆక్రమణ దారులు స్వయంగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది . వారికి ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని బెదిరిస్తున్నారని తాను నిరూపిస్తానని అంటున్నారు. కానీ అలాంటి నేతలు తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని చెప్పేలా రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం పాటించారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ ప్రజలు విషం తాగాల్సి వస్తుందన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే నల్లగొండలో సమస్య వస్తుందన్న అభిప్రాయం కల్పించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా .. మూసి ప్రక్షాళకు వ్యతిరేకంగా కాదని నిర్వాసితులకు న్యాయం చేయాలన్నవాదన వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది. గత నాలుగు రోజులుగా మూసి ఆక్రమణల విషయంలో రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తారని అనుకున్నారు. అందుకే ఆ ఆపేసిన క్రెడిట్ తమకు అంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీలు పడ్డాయి. కానీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని స్పష్టమన సంకేతాలు పంపారు.అంటే. .. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు కొనసాగుతుందని తేల్చేశారు. నిజానికి న్యాయవ్యవస్థ కూడా ఆక్రమణల్ని సమర్థించదు. నిబంధనల ప్రకారం కూల్చేయాలనే చెబుతుంది. అందుకే రేవంత్ ధైర్యంగా మందుకెళ్తున్నారని అనుకోవచ్చు.

Related Posts