YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బతుకమ్మ మీద ఆంక్షలు దుర్మార్గం

బతుకమ్మ మీద ఆంక్షలు దుర్మార్గం

హైదరాబాద్.
బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాతబస్తీలో ప్రశాంత వాతావరణంలో, అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, ద్వేషం చూపించడాన్ని మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందనడానికి ఇదే నిదర్శనం. మహిళలకు అలవిగాని హామీలిచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను పక్కనపెట్టడం తెలంగాణ సంస్కృతిని, మహిళాలోకాన్ని అవమానించడమేనని అన్నారు.
హైకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్య. తెలంగాణ పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించేలా, సంస్కృతిని కించపర్చేలా కుట్ర జరుగుతోంది. అసలు హిందూ పండుగలంటే ఎందుకింత కడుపు మంటనో స్పష్టం చేయాలి. పాతబస్తీ పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనే లేదనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నామని అన్నారు.

Related Posts