YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కి కాయకల్ప అవార్డు

తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కి  కాయకల్ప అవార్డు

వికారాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో వికారాబాద్ జిల్లా లోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి రాష్ట్ర స్థాయిలో సత్తాచాటి అవార్డు సొతం చేసుకుంది . 94శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచి అవార్డును సాధించింది.  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవ లపై సర్వే చేసి అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులను అందజేస్తోంది.  ఈ కోవలో రాష్ట్రస్థాయిలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ అభియాన్, నేషనల్ హెల్త్ మిషిన్ ఆధ్వర్యంలో 2023,24 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై కాయకల్ప అవార్డు ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది.
 రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, హైజిన్ ప్రాధాన్యత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ తోపాటు తదితర అంశాలపై కాయ కల్ప పోటీలు జరిగాయి. అందులో రాష్ట్రంలోని పలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్ సీలు, పీహెచ్ సీలు పోటీ పడ్డాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలో 94శాతం మార్కులతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్ లోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచాయి.
తాండూరు ఆస్పత్రికి మూడోసారి కాయకల్ప ఆవార్డు వచ్చింది. 2000 - 21 - 22లో వరు సగా రెండు సార్లు అవార్డు వరించింది. గతేడాది రేసులో వెనుకబడింది. 2023- 24 సంవత్సరంలో కేంద్ర సర్వే బృందాన్ని మెప్పించింది. దీంతో మూడోసారి అవార్డు వచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ త్వరలో ఢిల్లీలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అవార్డును అందుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్  మాట్లాడుతూ...
తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు రావడం సంతో షంగా ఉంది. గతంలో రెండు సార్లు అవార్డు వచ్చింది. అవార్డు రావడం వెనుక ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితము ఉన్నాయని అదే విధంగా ఆస్పత్రిలో అన్ని సేవలు రోగులకు అందించడం,ప్రతి రోజు ఆస్పత్రిలో నిర్వ హించే పారిశుద్ధ్య కార్యక్రమం కూడా  జరగడం . వీటితోపాటు   ఆస్పత్రిలో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ప్రజాప్రతినిధులు సహకరించడం జరగడం వల్ల ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లుగా తెలిపారు.

Related Posts