YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కొత్త రకం ట్రాప్...

విశాఖలో కొత్త రకం ట్రాప్...

విశాఖపట్టణం, అక్టోబరు 7,
అందమైన రూపం.. ఆకట్టుకొనే అభినయం.. మాటల కవ్వింపులు.. వయ్యారాల పలుకులు.. ఇంకేముంది అదృష్టం తలుపుతట్టింది అనుకుంటున్నారా.. అయితే మీకు చిక్కులు వచ్చినట్లే. మీ పరువుకు భంగం కలిగినట్లే. సోషల్ మీడియా ద్వారా చిలుక పలుకులు పలకడం.. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ చేయడం నేటి సమాజంలో పలువురికి ఒక వృత్తిలా మారింది. ఇలా ఎందరినో వలలో వేసుకొని, మోసం చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ బాధితుల లిస్ట్ తీస్తున్న పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. అందుకే నేరస్తులు సైతం ఇదే మాద్యమాన్ని వాడుకొని.. ఎందరినో బురిడీ కొట్టిస్తున్నారు. హనీ ట్రాప్ పేరిట జరిగే మోసాలు అయితే రోజురోజుకు అధికమవుతున్నాయి. హనీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా.. సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం.. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం.. మత్తు ప్రయోగించడం.. ప్రవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం. ఇంతకు ఇలా చేస్తున్నది ఎవరో అనుకొనేరు కొందరు అందమైన యువతులు. అందమైన వారే ఎందుకో తెలుసా.. వెంటనే బురిడీ కొట్టించి లక్షలు దండుకోవడం వీరి వంతు.ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎన్నో సంచలనమైన కేసులను చేధించిన విశాఖ పోలీసులు.. ఈ కేసు అంతు తేల్చేలా పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేసి నిందితురాలు జాయ్ జెమిమాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు షాకుల మీద షాకులు తగిలాయి.హనీ ట్రాప్ పేరిట ఒక ముఠాగా ఏర్పడ్డ దుండగులు.. పథకం ప్రకారం జెమిమాను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఎందరినో బురిడీ కొట్టించారు. ముందు పరిచయం.. ఆ తర్వాత మత్తు ఇవ్వడం.. అసభ్యకర వీడియోలు తీయడం.. ఇక బెదిరించడం ఇలా సాగేది ఈ ముఠా పని. అలాగే సంబంధిత మహిళకు ఎలా బుట్టలో పడవేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారంటే ఈ ముఠా కథ వేరే అని చెప్పవచ్చు.అయితే ఈ కేసు గురించి విశాఖ సీపీ బాగ్చి మాట్లాడుతూ.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి వలలో పడి మోసపోయిన వారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇదొక ముఠాగా తాము గుర్తించామని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు.. త్వరలోనే మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. తర్వాత యువకుడికి ఫోన్‌ చేసి అమెరికా నుంచి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టుకు రాగానే మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్స్‌ ఇచ్చి పెర్ఫ్యూమ్‌ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసినట్లు ఫొటోలు తీయించింది. వాటితో యువకుడిని బ్లాకెమెయిల్‌ చేసింది. దీంతో బెదిరిపోయిన యువకుడు తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అయినా వినిపించుకోకుండా జెమీమా తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేంది. ఇటీవల బీమిలిలోని ఓ హోటల్‌లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని యువకుడితో రూ.5 లక్షలు ఖర్చు చేయించింది. తర్వాత నిశ్చితార్థం, ఏకాంతంగా ఉన్న ఫొటోలు చూపించి మురళీనగర్‌లోని తన ఇంట్లో నిర్బాంధించింది. పెళ్లి చేసుకోకపోతే.. కేసు పెట్టి అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. డబ్బులు కాజేసింది.ఒక రోజు యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో సహచరులతో కలిసి కత్తితో బెదిరించి చంపడానికి యత్నించింది. జెమీమాను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామని ఆమె అనుచరులు కూడా బెదిరించారు. అక్టోబర్‌ 4న బాధితుడు తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జెమీమాతోపాటు ఆమె అనుచరులను అరెస్టు చేశారు. జెమీమా గతంలో కూడా తన స్నేహితులతో కలిసి ధనవంతులైన అబ్బాయిలను ట్రాప్‌ చేసి భారీగా డబ్బులు వసూలుచేసినట్లు పోలీసులు తెలిపారు.అలాగే సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాల పట్ల యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చిక్కులే తెచ్చే పరిస్థితులు ఉన్నాయని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు విశాఖ సీపీ బాగ్చి.

Related Posts