YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా... మైనస్సా...

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా... మైనస్సా...

తిరుపతి, అక్టోబరు 7,
జనసేనాని జనం మెచ్చిన సేనాని అయ్యారు. ఇప్పుడు హైందవ సేనానిగా మారుతున్నారు. నిష్టగా దీక్షలు చేస్తూ హైందవ ధర్మం కోసం పోరాటం అంటూ.. బీజేపీని మించిన ఎజెండాతో దూసుకెళ్తున్నారు. తిరుమల లడ్డూ ఇష్యూలో పవన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు లడ్డూ వివాదాన్ని ఎంత వరకు అడ్రస్ చేయాలో అంతే ప్రస్తావించి..తర్వాత సైలెంట్గా ఉండిపోయారు. ఒకవేళ మాట్లాడినా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చెప్పారే తప్ప..ఇతర మతాల ప్రస్తావన తేలేదు.పవన్ కల్యాణ్ మాత్రం లడ్డూ ఇష్యూను పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇతర మతాల విషయంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా..సనాతన ధర్మం మీద మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. పాయశ్చిత దీక్ష చేసి..తర్వాత వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని గళమెత్తుతున్నారు.అంతేకాదు సనాతన ధర్మానికి ఇబ్బందులు ఎదురైతే చూస్తూ ఊరుకోనని అంటున్నారు. ఎంతకైనా వెళ్ళి తేల్చుకుంటామని చెప్పారు. రాజకీయాలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగుతానని కూడా చెప్తున్నారు. హిందుత్వం విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎవరూ ఈ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. కానీ జన బలమున్న పవన్ హిందుత్వ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ ఉందని అనేసి ఊరుకుంటే..ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలానే జరిగిందని..ఏకంగా అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలను ప్రస్తావిస్తూ అగ్గి రాజేస్తున్నారు పవన్. వారాహి సభలో సూడో సెక్యూలరిజం అంటూ సేనాని మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశంగా అవుతున్నాయి.అయితే బీజేపీని మించి పవన్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకు ఆయన అంతగా రియాక్ట్ అవుతున్నారనే దానిపై రకరకాల చర్చలు ఉన్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకే పవన్ పూర్తిస్థాయి హైందవ సేనాని అయిపోయారని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ధర్మాగ్రహం వెనక ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయంటున్నారు.అయితే కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్..వీర హిందూత్వ గళం వినిపించడం ద్వారా కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చ అవుతోంది. టీడీపీ మాత్రం అన్ని మతాలను సమానంగా చూస్తామని..సెక్యూలరిజమే తమ ఎజెండా అంటోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ మాత్రం హిందుత్వ గళం ఎత్తుకున్నారు. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు బీజేపీకి ఆనందంగానే ఉంటాయి. కానీ టీడీపీనే ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.ఏపీ కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఉమ్మడి పౌర స్మృతితో పాటు ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి నిర్ణయాల మీద ఎన్నికల వేళ గట్టిగానే మాట్లాడింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు రద్దు అంటోంది కేంద్రం. దానికి సంబంధించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడతారని అంటున్నారు. టీడీపీ, జనసేన స్టాండ్ ఏంటో కూడా స్పష్టం కానుంది. అయితే లడ్డూ ఇష్యూ తర్వాత కూడా పవన్ వారాహి డిక్లరేషన్ మీద మరింత జోరు పెంచుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వారాహి డిక్లరేషన్ మీద ఇదే దూకుడుతో పవన్ ముందుకెళ్తే ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెరదీసే అవకాశం ఉంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
తప్పు పట్టిన హర్షకుమార్
సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్, లడ్డూల పేరుతో చంద్రబాబు.. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి మిగిలిన పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకోవడం పొరపాటు. ప్రజలు పరిపాలన చూస్తారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.మీ పరిపాలనలో ఇప్పటివరకు ఒక పెన్షన్, ఒక అన్న క్యాంటీన్లు తప్పించి చేసిందేమీ లేదు. ఇసుక ఎక్కడా దొరకడం లేదు. స్కాలర్ షిప్స్ ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. అనేక హామీలు ఇచ్చారు. అందులో ఏదీ కూడా చంద్రబాబు సక్సెస్ అవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్. మూడు నాలుగు నెలల్లోనే ఫెయిల్డ్ గవర్న్ మెంట్ గా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటన్నింటిని కప్పి పుచ్చుకోవడానికి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు వేసిన ప్లాన్లే లడ్డూలు, సనాతన ధర్మం. అటువంటి జిమ్మిక్కులు చేయకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిపాలనపై దృష్టి పెట్టాలి” అని హర్షకుమార్ సూచించారు.

Related Posts