YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న రేవంత్

కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న రేవంత్
టీడీపీతో పోల్చుకుంటే ఎందరో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందరూ ఢిల్లీ స్థాయిలో చక్రం తప్పిగలిగిన వారే. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో సీనియర్ నేతలుగా ఉన్న ఎవరినీ హైకమాండ్ నమ్మడంలేదు. టీపీసీసీ బాస్‌కే ఢిల్లీలో ఘోర అవమానం కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయి. కానీ నిన్న గాక మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి మాత్రం ఆ పార్టీలో చక్రం తిప్పుతున్నారు. తన మార్కు రాజకీయాలతో కాంగ్రెస్‌లో కీలక నేతగా మారుతున్నారు. ఈ తరుణంలోనే ఆయన సత్తాను తెలిపే ఒక అంశం తెరపైకి వచ్చింది. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కేసీఆర్.. తనను జైలులో పెట్టించాడనే కోపంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. టీడీపీలో ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలేనని భావించిన ఆయన.. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనొక్కడే కాదు.. తనతో పాటు చాలా మందిని కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లిపోయాడు. వెళ్లినవాడు ఊరికే ఉన్నాడా.. తను అడిగిన పదవులన్నింటిని ఇవ్వాలని మొదట రాహుల్‌కు రాయబారం పంపాడట రేవంత్.. దానికి ఒప్పుకోకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగాడట. దీంతో తన పంతాన్ని నెగ్గించుకుంటున్నాడుఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీతక్క నాయకత్వంలో ఏపీ మహిళా కాంగ్రెస్‌ బలోపేతమవుతుందని భావించే హైకామాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఈ నియామకం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఆయన ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. తనకు పదవులు ఇవ్వకున్నా.. తనను నమ్ముకుని వచ్చిన వారికి మాత్రం కీలక పదవులు కావాలని కోరారు. దీనికి రాహుల్ కూడా ఓకే చెప్పారు. దీని ఫలితమే సీతక్క నియామకంగా తెలుస్తోంది. మరి తనకు రాజకీయ గుర్తింపునిచ్చిన టీడీపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సీతక్క ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఆసక్తిగా మారింది.

Related Posts