YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం దుకాణాల కోసం లేని స్పందన -

మద్యం దుకాణాల కోసం లేని స్పందన -

విజయవాడ, అక్టోబరు 8,
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకు వచ్చింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అంతా జే బ్రాండ్లను దింపి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారని.. ప్రభుత్వం  గుప్పిట్లోనే అన్ని పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వచ్చారు. దానికి తగ్గట్లుగానే  టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మద్యం విధానాన్ని మార్చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం కొత్త పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు రెండేళ్ల పాటు కేటాయించేందుకు అప్లికేషన్లు ఆహ్వానించారు. అయితే ఈ దుకాణాల కోసం పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలంటే రెండు లక్షల రుపాయలు పెట్టి అప్లికేషన్ కొనాలి. అది నాన్ రిఫండబుల్ .అంటే లాటరీలో మద్యం దుకాణం వచ్చినా రాకపోయినా ఆ  మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు అక్కడి ప్రభుత్వం ఇలాగే దుకాణాల  కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తే రెండు వేల కోట్లకుపైగా వచ్చాయి. ఏపీలోనూ అలాగే వస్తాయని అనుకున్నారు. కానీ చివరి తేదీ సమీపస్తున్నా పెద్దగా  స్ందన కనిపించడం లేదు. ఇప్పటి వరకూ అప్లికేషన్ల ఫీజుగా రెండు వందల కోట్ల వరకే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ ఏరియాలో మద్యం దుకాణం కోసం మూడు అప్లికేషన్లు వస్తే మూడింటిలోనూ లాటరీ తీసి ఒకరికి ఇస్తారు. ఇక్కడే వ్యాపారులు అతి తెలివి చూపిస్తున్నారని.. అప్లికేషన్లు తమ ఏరియాలో ఎవరు కొనుగోలు చేస్తారో వారికి ముందుగానే ఆఫర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓ ముగ్గురు మాత్రం.. తమలో ఎవరికి వచ్చినా సరే ముగ్గురు పార్టనర్లుగా ఉండి మద్యం దుకాణం నడిపించుకోవచ్చన్న ఒప్పంతో రింగ్ అయి ఆ ముగ్గురే దరఖాస్తులు పెడుతున్నారు. ఇతరులు మాత్రం మధ్యలోనే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ వ్యాపారుల్లో టీడీపీ నేతలు, వారి అనుచరులు ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణం వ్సతే.. భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి.. చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు వాటిని దక్కించుకునేందుకు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాలకు అప్లికేషన్లు తక్కువగా వస్తూండటంతో తెర వెనుక ఏం జిరగిందన్నదనిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకంటున్న వారిని ఎవరైనా అడ్డుకున్నట్లుగా తేలితే కఠఇన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపుతున్నారు. అలాగే ఎవరూ రింగ్ కావొద్నది ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని నేరుగానే  చెబుతున్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఈ దందాకు దూరంగా ఉన్నప్పటికీ.. కొంత మంది మాత్రం.. ఇదే అవకాశం అనుకని.. రింగ్ అయ్యేలా వ్యాపారుల్న ిసిద్ధం చేస్తున్నరని చెబుతున్నారు. అప్లికేషన్ల గడువు ముగిసేలోగా ప్రభుత్వం అనుకున్న విధంగా స్పందన రాకపోతే గడువు పొడిగించే అవకాశం ఉంది.
ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు కలుగ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒడిస్సా సరిహద్దు నియోజకవర్గాల్లో షాపులకు ఎటువంటి దరఖాస్తులు వేయవద్దని ఓ కీలక నేత ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిస్సా కు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రికి షాపులన్నీ వదిలేయాలని సదరు ప్రజాప్రతినిధి ఆదేశాలిస్తున్నట్లు సమాచారం. అదే జిల్లాల్లో రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజా ప్రతినిధులు ఇటీవల విశాఖలో మద్యం వ్యాపారులతో సమావేశం అయ్యారు. తమ నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు గుంటూరు, కృష్ణాజిల్లాలో అయితే ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు భయపడి వ్యాపారులు ఎవరు ముందుకు రావడం లేదు.
* ప్రభుత్వ ఆదేశాలు భే ఖాతరు
మద్యం పాలసీలో ఎటువంటి అవకతవకలు జరగవని ప్రభుత్వం చెబుతోంది. మద్యం షాపుల కేటాయింపులో తల దూర్చవద్దు కూడా ఎమ్మెల్యేలకు స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినా సరే ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు ఇందులో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఓ 961 షాపులకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం విశేషం. తిరుపతి జిల్లాలో అయితే 133 షాపులకు సంబంధించి దరఖాస్తులకు భూమి రాలేదు. నెల్లూరు జిల్లాలో 84, కాకినాడ జిల్లాలో 58, ప్రకాశం జిల్లాలో 60, శ్రీ సత్య సాయి జిల్లాలో 60, విశాఖ జిల్లాలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రానట్లు తెలుస్తోంది. 3396 షాపులకు గాను.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 8274 మాత్రమే. అయితే విజయనగరంలో మాత్రం మద్యం దుకాణాలకు భారీ ఎత్తున దరఖాస్తులు రావడం విశేషం. అయితే మిగిలింది మూడు రోజులు మాత్రమే కావడంతో భారీ ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన 8274 దరఖాస్తుల ద్వారా 165 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే ఈపాటికే 30 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. కనీస స్థాయిలో కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం.

Related Posts