YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హిందూపురంలో బెడిసి కొట్టిన కూటమి వ్యూహం

హిందూపురంలో బెడిసి కొట్టిన కూటమి వ్యూహం

అనంతపురం, అక్టోబరు 9,
ఆలస్యం అమృతం విషం అని చెబుతుంటారు పెద్దలు. ఇది హిందూపురంలో అక్షర సత్యం అయింది. వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్లను.. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో మున్సిప‌ల్ కౌన్సిల్‌లో టీడీపీ సంఖ్యాబలం పెరిగింది. వెంటనే ఛైర్మన్ ఎంపికకు ఎన్నికలు నిర్వహించకుండా.. ప్ర‌భుత్వం మ‌న‌దే క‌దా.. ఎక్క‌డికి వెళ్లిపోతారు అనే ధోర‌ణితో టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించారు. దీంతో హిందూపురం ఛైర్మెన్ ప‌ద‌వి మళ్లీ వైసీపీ ఖాతాలోకి చేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.హిందూపురం పురపాలక సంఘంపై టీడీపీ జెండాను ఎగుర వేయాలని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీనియర్ నేతలు వ్యూహలపై వ్యూహలు రచించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లను గత ఆగష్టు 15న బాలయ్య సమక్షంలో టీడీపీలోకి చేర్చుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన ఆరుగురు, బీజేపీ, ఎంఐఎంకు ఇద్దరు కౌన్సిలర్లు, వైసీపీకి చెందిన ప‌ది మంది కౌన్సిలర్లు, స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్‌తో పాటు మొత్తం 19 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలుపుకుని 21 మందితో టీడీపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది.ఇక హిందూపురం ఛైర్మన్ టీడీపీ ఖాతాలోకి వస్తోందని అందరూ ఊహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్ డి.రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీని విభేదించి టీడీపీలోకి చేరిన నలుగురు కౌన్సిలర్లు.. సోమవారం వైసీపీ నాయకులు వేణురెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీలోకి చేరారు. వీరికి వేణురెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. దీంతో.. మళ్లీ హిందూపురం పురపాలక సంఘంపై వైసీపీ జెండా ఎగరనుంది.సాధారణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను టీడీపీ హస్తగతం చేసుకోవాలని వ్యూహలను రచించింది. దీంతో హిందూపురం నియోజకవర్గంలో ఆగష్టు నెలలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. చిలమత్తూరు మండలంలో వైసీపీ ఎంపీటీసీలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతోపాటు హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు.గత ఆగష్టు 20న మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ఇంద్రజతో తన పదవికి రాజీనామా చేయించారు. దీనికి సభ్యులు అందరూ ఆమోదం తెలిపారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంటనే డీఎంఏకు పంపారు. ఎన్నికల సంఘం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికకు నోటిపికేషన్ ఇచ్చే లోపు టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లు మల్లికార్జున, రహమత్ బీ, మణి, పరశురాంలు తిరిగి వైసీపీలోకి చేరారు. దీంతో వైసీపీ బలం పుంజుకుంది.హిందూపురం పురపాలక సంఘంలో 38 వార్డులు ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా వైసీపీ 30 స్థానాల్లో గెలిచింది. టీడీపీ ఆరు స్థానాల్లో గెలిచింది. బీజేపీ-1, ఎంఐఎం-1 స్థానాల్లో గెలిచారు. వైసీపీ గెలిచిన 30 స్థానాల్లో ఎన్నికలకు ముందు 12వ వార్డు, 27వ వార్డు వైసీపీ కౌన్సిలర్లతో పాటు ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. అప్పటికి తొమ్మిది మంది టీడీపీ కౌన్సిలర్లు అయ్యారు.బాలకృష్ణ సమక్షంలో ఛైర్ పర్సన్ సహా తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దీంతో మొత్తం 18 మంది కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో కలుపితే.. 20 అయ్యింది. బీజేపీ మ‌ద్ద‌తు కూడా టీడీపీకే ఉంటుంది. దీంతో కూట‌మి బ‌లం 21కి చేరింది. వైసీపీ బ‌లం 30 నుంచి 19కి త‌గ్గింది. వీరిలో మరో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్పట్లో చ‌ర్చ జ‌రిగింది.

Related Posts