YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప లో టీడీపీ పరిణామాలపై చంద్రబాబు గుస్సా

కడప లో టీడీపీ పరిణామాలపై చంద్రబాబు గుస్సా
ఏపీలో మ‌రో ప‌ది మాసాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌లు అధికార టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో పార్టీ అదినేత‌, సీఎం చంద్రబాబు పార్టీని తిరిగి అధికార పీఠంపై కూర్చో బెట్టేందుకు నానాతిప్పులు ప‌డుతున్నారు. నిఘా వర్గాల నివేదికలను దృష్టిలో ఉంచుకొని మీ ఇద్దర్ని ఇక్కడ పదవుల్లో పెట్టడం తాను చేసిన పెద్ద పొరపాటు అంటూ సీఎం మండిపడ్డట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు వర్గ విభేదాలు తీవ్రం అవుతుంటే మీరేం చేస్తున్నారు. పరిష్కరించాల్సింది పోయి, ఏదో వైపు మీరు మొగ్గు చూపుతూ పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్నారని నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీని న‌వ్వుల పాలు చేస్తున్న నాయ‌కుల‌పై ఆయ‌న తెర‌చాటున తీవ్ర స్థాయిలో క్లాస్ ఇస్తున్నారు. తాజాగా క‌డ‌ప‌లో ప‌ర్యటించిన చంద్రబాబు.. అక్కడిపార్టీ ప‌రిస్థితిపై స‌మీక్షించిన నేప‌ధ్యంలో ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి స‌హా ఇత‌ర నాయ‌కుల‌కు త‌లంటార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. అత్యంత కీల‌క‌మైన జిల్లాగా టీడీపీ భావిస్తున్న క‌డ‌ప‌లో పార్టీ ఇంత దిగ‌జారుడుగా ఉంటే ఎలా అని ప్రారంభించి.. గ‌త ప్రస్తుత విష‌యాల‌ను కూడా తొవ్వితీసి వారికి క్లాస్ పీకార‌ని స‌మాచారం.ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా, అతని కంటే అనుభవం లేదు. మీ అనుభవం ఏం ఏడ్చింది అనడంతో కిమ్మనకుండా ఉండిపోయినట్లు సమాచారం. ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహారం అయ్యాక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలను బస్సులోకి పిలిపించినట్లు సమాచారం. ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని, మీరు కలిసి పనిచేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసని బాబు ముఖాన్నే చెప్పినట్లు సమాచారం. లింగారెడ్డి ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించగా మంత్రి, జిల్లా అధ్యక్షుడు ఇద్దరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపైన విభేదాలంటూ రచ్చకెక్కితే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తానికి ఈ వ్యవ‌హారంతో స‌ద‌రు నాయ‌కులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. మ‌రి ఇప్పటికైనా క‌డ‌ప‌లో పార్టీ లైన్‌లోకి వ‌స్తుందో రాదో చూడాలి.విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో చంద్రబాబు క‌డ‌ప‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే, జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది. త‌మ్ముళ్లు నిత్యం గొడ‌వ‌లు ప‌డుతూనే ఉన్నారు. ఆధిప‌త్య ధోర‌ణితో పార్టీని దిగ‌జారుస్తున్నారు. కొంద‌రు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన కొంద‌రు నాయ‌కులు కూడా టీడీపీకి వ్యతిరేకంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే ప్రచారం ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం. నిన్నటికి నిన్న క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె గ్రామదర్శిని వెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లగానే బస్సు నిలిపేశారు. బస్సులో ఉన్నవారిని దింపేసి, ముందుసీట్లో ఉన్న సీఎం వెనుక వైపునకు వెళ్లారు. బస్సులోపలికి ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని పిలిపించారు. బద్వేల్‌లో ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నేత విజయజ్యోతి ఇద్దరిని టార్గెట్‌ చేస్తే మీరు ఇచ్చే మేసేజ్‌ ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగులో గ్రూపు విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారు. ఒక వర్గానికి అనుగుణంగా పనిచేయడం ఏ మేరకు సబబు. పార్టీని ఏం చేయాలనుకుంటు న్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరు నాయకులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.

Related Posts