ఖమ్మం
త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ డిప్యూటీ సీఎం
త్వరలో విద్యుత్ శాఖలో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు. అటు దసరా సందర్బంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నామని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ అన్ని క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.