పన్నూరమ్మ తిరునాళ్లకు వచ్చి అమ్మవారికి పూజలు చేయడం మహర్భాగ్యంగా భావిస్తున్నా. బంధుమిత్రులందరూ తరలివచ్చి వడ్లపూడిలో పండగ వాతావరణం నెలకొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం నాడు అయన మనుబోలు మండలం వడ్లపూడిలో శ్రీ పన్నూరమ్మ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గ్రామస్తులతో పాటు జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకున్ననని అన్నారు. గత సీజన్ మాదిరిగానే వచ్చే సీజన్ లోనూ ఒక్క ఎకరా ఎండిపోకుండా పంటలు పండి రైతులందరూ ఆనందంగా ఉండాలని వేడుకున్నా. అమ్మవారిని ప్రధానంగా ఓ కోరిక కోరుకుంటున్నా..ఎవరూ కోర్టుకు పోయి డేగపూడి- బండేపల్లి కాలువ పనులకు అడ్డంకులు సృష్టించకుండా పనులు సాఫీగా సాగి రైతులందరూ సంతోషంగా ఉండాలి. ఆమంచర్ల వద్ద కనుపూరు కాలువకు డీప్ కట్టింగ్ చేసి 24 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం..నిధులు మంజూరవగానే పనులు పూర్తి చేస్తామని అన్నారు.