YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జైలు శిక్షతో జరిమానా...

 జైలు శిక్షతో జరిమానా...

హైదరాబాద్, అక్టోబరు 10,
తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. భారతీయ న్యాయ సంహితలోని క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్ 356 కింద ఆమెపై కేసు పెట్టారు. ఇంతకీ నాగార్జున మంత్రి మీద వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన సెక్షన్ 356 ఏం చెప్తుంది? ఒకవేళ ఈ కేసులో నేరం నిరూపణ అయితే ఎలాంటి శిక్షపడుతుంది? జైలు శిక్ష విధిస్తారా? జరిమానా విధిస్తారా? ఈ రెండు కలిపి విధించే అవకాశం ఉంటుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది జూలై 1 నుంచి భారతీయ న్యాయ వ్యవస్థ కొత్త రూపు సంతరించుకుంది. ఆంగ్లేయుల కాలం నుంచి దేశంలో కొనసాగుతున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ఈ కొత్త చట్టాలు అమలవుతున్నాయి. వాస్తవానికి ఆంగ్లేయుల కాలం నటి చట్టాల్లో కొన్ని సెక్షన్లు చాలా క్రిటికల్ గా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందికి వస్తుందనే విషయంలో కాస్త తికమక ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన న్యాయ చట్టాలను మరింత సరళంగా తీర్చిదిద్దారు. గతంలో ఐపీసీలోని 511 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం బీఎన్ఎస్ లో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షను ఒకే సెక్షన్ కిందికు తీసుకువచ్చారు. రీసెంట్ గా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద మంత్రి కొండా సురేఖపై నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 356 కేసు కోర్టులో నిరూపింత అయితే కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు ప్రకారం నిందితులకు రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కోసారి జరిమానా కూడా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కొండా సురేఖ చేసిన సీరియస్ కామెంట్స్ ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అభియోగాలు బలంగా మోపే అవకాశం ఉంటుంది. ఆమె నేరం నిరూపితం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఆమెకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ కేసు విచారణ ఎంతకాలం పాటు కొనసాగుతుంది? అనే విషయాన్ని బట్టి కేసు తీవ్ర ఆధారపడి ఉంటుందనే వాదనాలూ వినిపిస్తున్నాయి.

Related Posts