కాకినాడ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు దసరా పండుగకు చుట్టాలు వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్థిరపడ్డ జిల్లా ప్రజలు పండగ కోసం జిల్లాకు వస్తున్నారు. దీంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ బస్సులు వారికి బాగా ఉపయోగపడుతున్నాయి. వాయిస్: ప్రైవేట్ బస్సులు విపరీతంగా రేట్లు పెంచేసాయి .ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ రేట్లు పెంచలేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కాకినాడ విశాఖ, కాకినాడ హైదరాబాద్ మధ్య ప్రతిరోజు 100కు పైగా బస్సులు నడుపుతున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది .ఆక్యుపెన్సీ రేటు పెరిగింది .పండగ పుణ్యమాని బస్సులు కిటకిటలాడుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.