నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ శనివారం ఉదయం పర్యటించారు. రోడ్ల నిర్మాణం పనులను, అన్న క్యాంటీన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రోడ్ల పునర్నిర్మాణం పనులు డిసెంబర్ 2019 నాటికి పూర్తిచేస్తామని అన్నారు. నగరంలోని ప్రతి రోడ్డును ఎండ్ టు ఎండ్ వేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పేదలు నిరుపేదల కోసం 203 అన్న క్యాంటీన్లను నిర్మిస్తున్నామని అన్నారు. అన్న క్యాంటీన్లను ఈనెల ప్రారంభిస్తాం. అన్న కాంటీన్ లో పేదలకు పూటకు 5 రూపాయల చొప్పున మూడు పూటలా 15 రూపాయలకే భోజనం అందిస్తామని వెల్లడించారు. పేదల భోజనానికి 58 రూపాయలు సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పుట్టిననాటి నుంచి మరణం వరకు ప్రతి విషయంలోనూ పేదలకు సహకారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే నని అన్నారు.