తిరువనంతపురం
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజా ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశంలో ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరపాలంటూ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరపున మంత్రి ఎంబీ రాజేశ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అజెండాకు అనుకూలంగానే దీనిని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని రాజేశ్ విమర్శించారు.