YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రోజుకు 110 కోట్ల మద్యం

రోజుకు 110 కోట్ల మద్యం

హైదరాబాద్, అక్టోబరు 14,
తెలంగాణలో దసరా సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు కూడా భారీగా జరిగాయి. 8 రోజుల్లో 8.37 లక్షల మద్యం కేసులు, 14.53 లక్షల బీరు కేసులు విక్రయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి గణాంకాలు పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.తెలంగాణలో దసరా, బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. పండగంటే ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం చుక్క ఉండాల్సిందే. దీంతో రాష్ట్రంలో గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాలతో పోలిస్తే 25 శాతం(5 రోజుల్లో) అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయని దుకాణదారులు అంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి గణాంకాలు పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈ సారి ఐదు రోజుల్లో అమ్మకాలు 15 శాతం పెరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజుకు రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌ షాపులకు తరలించారు. ఒకే రోజు ఏకంగా 2.35 లక్షల బీర్లు వైన్‌ షాప్‌ లకు చేరాయి. ఈ ఏడాదిలో ఈ రెంజ్ లో బీర్ల అమ్మకాలు జరగడం ఇదే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.సాధారణంగా రోజుకు లక్ష కేసుల వరకు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి.5 రోజుల మద్యం విక్రయాలు పరిశీలిస్తే రోజుకు 1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.  ఈనెల 1 నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గత 8 రోజుల్లో 8.37 లక్షల మద్యం కేసులు, 14.53 లక్షల బీరు కేసులు విక్రయించారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.800 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా....ఈ ఏడాది 10 రోజుల్లో గతంలో కుంటే 6.55 శాతం మద్యం అదనంగా లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి.

Related Posts