YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూసీ పోరాటంపై డైలమాలో బీఆర్ఎస్?

మూసీ పోరాటంపై డైలమాలో బీఆర్ఎస్?

హైదరాబాద్, అక్టోబరు 14,
తెల్లారితే ఆందోళన చేస్తున్నామ్. వాళ్ల గొంతై వినిపిస్తున్నామ్. ఆ టాపిక్‌ను ఎవరూ చేయలేనంత హైలెట్‌ చేస్తున్నాం. ఇంతకీ అక్కడ బాధితులు ఎవరు.? బడాబాబులు ఎవరు.? మనం చేస్తున్న ఆందోళన పేదల కోసమేనా.? మూసీ అంశంలో మనం చేస్తున్న పోరాటం కరెక్టేనా.? లేదంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఓ ఆందోళన చేయాలి కాబట్టి రోడ్డెక్కుతున్నామా.? మూసీ ప్రక్షాళనపై చేస్తున్న పోరాటంతో మైలేజ్‌ వస్తుందా..లేక మూసీ మురికి అంటుకుంటుందా..బీఆర్ఎస్‌ పార్టీని ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయట. అసలు ఆందోళనలు అవసరమా అన్న డైలమాలో పడిందట కారు పార్టీ. మూసీ కంపు తీస్తామని సర్కార్..ముంపు బాధితుల పరిస్థితి ఏంటని బీఆర్ఎస్‌..పెద్దఎత్తున డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో ఆక్రమణలను తొలగిస్తుండటం దుమారం లేపుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ మూసీ నిర్వాసితుల పక్షాన నిలుస్తుంది. తెలంగాణ భవన్‌లో నిర్వాసితులతో సమావేశాలు నిర్వహిస్తూనే..మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికిప్పుడు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి మూసీ ప్రక్షాళన చేస్తారని..ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. అంతేకాదు మూసీ నిర్వాసితులను ఉన్నఫలంగా పంపిచేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్తారని, వారికి తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ భరోసా ఇస్తోంది.నిర్వాసితుల ఇళ్లపై బుల్డోజర్‌ వాలితే ఊరుకోమని.. ఏ రాత్రి ఫోన్‌ చేసినా వస్తామని చెబుతూ భరోసా ఇస్తున్నారు. అయితే మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో పడిందట బీఆర్ఎస్. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఆందోళ చేయాలన్న దాంట్లో మూసీపై పోరాటం చేస్తున్నామా అని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా దాదాపు 16వేల ఆక్రమణలు తొలగిస్తున్నా.. అందులో మెజార్టీ జనం పేద వర్గాల వారే. వారందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది.ఇదే అంశం బీఆర్ఎస్ నేతలను సందిగ్దంలో పడేసిందట. మూసీ ఆక్రమణదారుల్లో వేలాది మందికి మంచే జరుగుతుండగా తక్కువ మందికి మాత్రమే నష్టం జరుగుతోందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారట. మెజార్టీ పేదలకు మంచి జరిగే కార్యక్రమాన్ని అడ్డుకుని, వందల మంది కోసం ఆందోళన, పోరాటం చేస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందా రాదా అన్న డైలమాలో పడ్డారట బీఆర్ఎస్ నేతలు. అందుకే మూసీ ప్రక్షాళనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ప్రకటించిన కేటీఆర్..పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది.మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్దం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్లాన్ చేసి అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చారని కాంగ్రెస్ పెద్దలు ఆధారాలతో సహా వివరిస్తున్నారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తే మంచి పని, అదే మేము చేస్తే తప్పవుతుందా అని సీఎం రేవంత్ సహా మంత్రులు ఎదురుదాడికి దిగడంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కాస్త సర్ధుకున్న బీఆర్ఎస్ నేతలు..తాము కేవలం 17వేల కోట్లతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ప్లాన్ చేస్తే..ఇప్పుడు ఏకంగా లక్ష కోట్లపైగా ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.మూసీ ప్రక్షాళన వెనక ఏదో అవినీతి దాగి ఉందని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు. అయితే మూసీపై ఎంత పోరాటం చేసినా, ఎన్ని నిరసనలు చేపట్టినా తమకు అంత మైలేజీ రావడం లేదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైందని తెలుస్తోంది. ఇంతకీ మూసీపై మనం చేస్తున్న పోరాటం సరైనదేనా అన్న సందేహం కూడా వ్యక్తం అవుతోందట. మనం అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకున్న పనిని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని..మూసీ బాధితుల కోసం ఆందోళన చేస్తున్నా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న థాట్‌లో పడిపోయారట గులాబీ నేతలు.

Related Posts