YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వడివడిగా చంద్రయాన 4 అడుగులు

వడివడిగా చంద్రయాన 4 అడుగులు

నెల్లూరు, అక్టోబరు 14,
చంద్రయాన్-4 మిషన్‌కి సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడగు పడింది. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ స్టార్టప్‌ సంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు శక్తిశాట్‌ అనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో.. భాగంగా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార పోస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ శక్తిశాట్‌ మిషన్‌ ద్వారా 108 దేశాలకు చెందిన 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 12,000 మంది హైస్కూల్ విద్యార్థినులకు స్పేస్‌ టెక్నాలజీ, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. బ్రిటన్‌, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒక విద్యార్థిని చొప్పున 108 మందిని ఎంపిక చేస్తారు. వీరికి పేలోడ్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్‌లను రూపొందించడంలో శిక్షణ ఇస్తారు.ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ముందు మోడల్‌ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ శక్తిశాట్‌ మిషన్‌ కేవలం మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కలిగి ఉందని మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న కేసన్‌ తెలిపారు. బాలికలను ప్రోత్సహించడం ద్వారా సాధికారతను కల్పించడం, జీవితాలను మార్చే అవకాశాలను అందించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇప్పటి వరకు 18కి పైగా బెలూన్‌ శాటిలైట్లు, 3 సబ్‌ ఆర్బిటల్ పేలోడ్‌లు, 4 ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించింది. హైస్కూల్, కాలేజీ విద్యార్థుల సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించిన మొట్టమొదటి సంస్థగా గుర్తింపు పొందింది.

Related Posts