YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ పేరుతోనే దందా..

పవన్ పేరుతోనే దందా..

కాకినాడ, అక్టోబరు 14,
అధికారంలో ఉన్నవారి పేర్లు చెప్పుకుని వారితో దిగిన ఫోటోలు చూపించి బయట మోసాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జిల్లా స్థాయి అధికారి ఒకరు అదే పని చేయడం చర్చనీయాంశమయింది. కాకినాడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా  రవీంధ్రనాథ్ రెడ్డి అనే అధికారి బదిలీపై వచ్చారు. వచ్చీ రావడంతో ఆయన పవన్ కల్యాణ్‌కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన సిఫారసుతోనే వచ్చానని చెప్పి జిల్లా మొత్తం మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరించడం ప్రారంభించారు. ఆయన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో  కొంత మంది అధికారులు విషయాన్ని డిప్యూటీ సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లారు.  పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట - టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్న దువ్వాడ, దివ్వెలకాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారం మరీ వివాదాస్పదంగా మారడంతో అంతర్గతంగా విచారణ చేయించారు. ఆయన పవన్ కల్యాణ్‌తో పాటు  డిప్యూటీ సీఎం పేషీలోని ఉన్నతాధికారుల పేర్లను కూడా ఉపయోగించి దందాలు చేస్తున్నారని తేలింది. ఈ విషయాన్ని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. తన పేరును, తన కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఆయను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా తనదై నమద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత పారదర్శకంగా తన శాఖల బదిలీలు నిర్వహించారు. అవినీతి కోసం ఎవరికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదు. అయితే  ఆయన రాజకీయ అధికారానికి కొత్త కావడంతో ఆయన పేరును ఉపయోగించుకునేందుకు కొంత మంది అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాంటి వారిలో రవీంద్రనాథ్ రెడ్డి ఒకరు. విషయం తన దృష్టికి రాగానే పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. మరెవరూ తన పేరు కానీ.. తన కార్యాలయం పేరు కానీ ఉపయోగించుకుని ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని సంకేతాలు పంపారు.  పంచాయతీ  రాజ్ శాఖ ద్వారా పవన్  పల్లె పండుగ కార్యక్రమం కోసం తరిక లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి పల్లెలలో అభివృద్ధి పనులు జరిగేలా చూసేందుకు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను పంచాయతీలకు అందేలా చేశారు. ప్రతీ గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అందులో చేయాల్సిన పనులపై పూర్తిగా గ్రామ సభలో ఆమోదం తీసుకున్నారు. అటవీ శాఖలోనూ పారదర్శక పద్దతలు పాటిస్తున్నారు.  

Related Posts