YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్

న్యూఢిల్లీ, అక్టోబరు 15,
ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి.అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు చేస్తుందని అనుకుంటున్నారా. నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కాస్త తగ్గించేందుకు దిల్లీ సర్కార్ కదిలింది.సహజంగా దీపావళికి వారం రోజుల ముందు దిల్లీలో ఉండే వాతావరణ పరిస్థితులు ఈసారి 15 రోజుల ముందే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దిల్లీలో వాయి కాలుష్యం అక్టోబర్ 14 నాటికే విజృంభిస్తోంది.ఇలాంటి సమయంలో దీపావళికి టపాసులు కాల్చితే అసలు దిల్లీ మహానగరం వ్యాప్తంగా పీల్చుకునేందుకు గాలే ఉండదు. అందుకే ఈసారి టపాకాయలు ఎవరూ కాల్చొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.2025, జనవరి ఒకటో తేదీ వరకు దిల్లీలో టపాసులు తయారు చేయటం, నిల్వ చేయటం, అమ్మటంపై నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు. వాళ్లకు భారీ జరిమానా సైతం విధిస్తామని హెచ్చరించారు.

Related Posts