అమరావతి
ఆంధ్రప్రదేశ్లో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి - సీఆర్ఎఎఫ్ నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గుంటూరు- నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు అయన ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీని కలిసి చర్చించిన నేపథ్యంలో మంజూరు అయ్యాయి.