- ఈ తరహా డ్రోన్ లు మన సైన్యానికి లేవు..
- వీటితో మిసైల్స్ దాడులు చేయవచ్చు.
చైనా తయారు చేసిన 'వింగ్ లూంగ్' మానవ రహిత విమానాలు ఇప్పుడు పాక్ దగ్గరకు కూడా చేరాయి. ఈ విమానాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బేస్ నుంచి 280 కిలోమీటర్ల వేగంతో సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల ఈ విమానాలు వాటంతట అవే వెళుతూ శత్రు స్థావరాలపై బాంబు దాడులు చేసి వెనక్కు రాగలవు.అంతేకాదు రాడార్లకు చిక్కుండా తక్కువ ఎత్తులోనే వెళ్లే వీటిని కనుగొని ప్రతి దాడి చేయాలన్నా కష్టమే. సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి.
అలాగే సుమారు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. తేలికపాటి మిసైల్స్‌ను కూడా వీటికి అనుసంధానించి దాడులు చేయవచ్చు. చైనా వీటిని పాక్కు అందించిందన్న సమాచారం తమ వద్ద ఉన్నదని భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ తరహా డ్రోన్ లు ఇంకా ఇండియా సైన్యం వద్ద లేవని ఆయన అన్నారు.