YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మాన్యులకు పైసా ఖర్చు లేకుండా..వైద్య పరీక్షలు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి

మాన్యులకు పైసా ఖర్చు లేకుండా..వైద్య పరీక్షలు          తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కేటీఆర్, ప్రారంభించారు. మంత్రులకు వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. వైద్య వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాం. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50 శాతం పెరిగింది. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. ప్రస్తుతం 17బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. మనదేశంలో వైద్య వ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులకు పైసా ఖర్చుకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు.ఈ రోజు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం న‌ల్ల‌గొండ‌, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వ‌హించిన స‌ర్వేల్లో ప్ర‌జ‌ల రోగ నిర్ధార‌ణ ప‌రీక్షల కోసం త‌మ ఆదాయంలో అధిక మొత్తంలో ఖ‌ర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాల‌వుతున్న‌ట్లు గుర్తించాం. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ద్వారా ఉచిత ఆరోగ్య సేవ‌లు, క‌చ్చిత‌మైన వ్యాధుల నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్‌కహించాల‌న్న దృఢ సంక‌ల్పంతో మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్ ప‌రిధిలో తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్ సేవ‌లు ప్రారంభించ‌డం జ‌రిగింది.శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య ఆరోగ్య‌శాఖ‌లో మ‌రో మైలు రాయిగా నిలువ‌నుంది తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించ‌నుంది. వైద్య ఆరోగ్య సేవ‌ల‌ను విస్తృతం చేస్తూ, మెరుగు ప‌ర‌చ‌డం కోసం ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. స‌ర్కార్ ద‌వాఖానాల ద్వారా వైద్య సేవ‌లు పొందే వాళ్ళ సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. వాళ్ళ‌కి మ‌రింత మెరుగైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కూడా అందించేందుకు తెలంగాణ డ‌యాగ్నొస్టిక్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సెంట్ర‌ల్ హ‌బ్‌కి హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని ఒక జిల్లా హాస్పిట‌ల్, 5 ఏరియా హాస్పిట‌ల్స్‌, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 120 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ సెంట‌ర్లు, బ‌స్తీ ద‌వాఖానాల నుండి రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల శాంపిల్స్ సేక‌ర‌ణ జ‌రుగుతున్న‌ది. ఈ సెంట్ర‌ల్ హ‌బ్ 24గంట‌లూ ప‌ని చేస్తుంది.అంతేగాక 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు మినీ హ‌బ్‌లుగా ఉంటాయి. అలాగే అల్ట్రా సౌండ్‌, ఎక్స్‌రే, ఈసీజీ సేవలు కూడా  సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్ నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన సాంకేతిక స‌హాయం టాటా ట్ర‌స్ట్ అందిస్తున్న‌ది. ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, ప‌ట్ట‌ణ‌ సామాజిక ఆరోగ్య కేంద్రాల‌ల్లో సేక‌రించిన శాంపిల్స్ ని సెంట్ర‌ల్ హ‌బ్‌కి చేర్చ‌డానికి 8 వాహ‌నాలు ఏర్పాటు చేయ‌డ‌మైన‌ది. శాంపిల్స్ సేక‌ర‌ణ నుండి సెంట్ర‌ల్ హ‌బ్ చేరే వ‌ర‌కు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, అందుకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం కోసం సిబ్బందికి పూర్తి శిక్ష‌ణ ఇవ్వ‌డ‌మైన‌ది. తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్ సెంట్ర‌ల్ హ‌బ్‌లో అధునాతన ప‌రిక‌రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గంట‌లో 200 నుంచి 1000 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి వీల‌వుతుంది. 

Related Posts