YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫిషింగ్ హాలిడే దిశగా మత్స్యకారులు

 ఫిషింగ్ హాలిడే దిశగా మత్స్యకారులు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురం కొండబాబు కళ్యాణమండపంలో 9 తీరప్రాంత జిల్లాల మత్స్యకారుల సమావేశం జరిగింది. జిఓ ప్రకారం డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలి.. డీజిల్ ధర రూ. 38 ఉండగా రూ. 6.03 సబ్సిడి వుంది. ప్రస్తుతం డీజిల్ ధర రూ. 75 ఉన్నా అదే సబ్సిడి ఇవ్వడం దారుణం..ఇతర రంగాల్లో ఇస్తున్నట్టు మత్స్యకారులకు సబ్సిడి ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. ప్రభుత్వ జిఓ ప్రకారం 22.5 శాతం డీజిల్ పై సబ్సిడి చెల్లించాలి. వేట పరిధి పెరిగి ఖర్చులు విపరీతంగా పెరిగాయి.. మత్స్యకారులకు కనీస మద్దత్తు ధర ప్రకటించాలని వారు కోరారు. వేట విరామ సమయంలో ఇచ్చే పరిహారం పెంచాలి.. డిమాండ్స్ కి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వేట నిషేధం చేపట్టాలని 9 జిల్లాల మత్స్యకారుల సంఘాలు తీర్మానించాయి. మరో నాలుగు రోజుల్లో వేట విరామం ముగిసే లోగా డిమాండ్స్ పై స్పందించని పక్షంలో వేటకు విరామం ప్రకటించనున్నట్టు ప్రకటించాయి. 

Related Posts