YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ఇమేజ్ పడిపోయింది

చంద్రబాబు ఇమేజ్ పడిపోయింది

అనకాపల్లి
టిటిడి పరిపాలన భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నాకు దిగాయి. చింతా మోహన్ మాట్లాడుతూ లడ్డుపై విమర్శలు చేసి చంద్రబాబు నాయుడుకి డోన్ ఫాల్స్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు ఇమేజ్ పడిపోయింది.  తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ ను ప్రపంచమంతా పొగుడుతావుంది. ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీగా పేరుగాంచిన హార్స్ వర్డ్ యూనివర్సిటీ కూడా టిటిడి ఉద్యోగుల సేవలను గుర్తించి, పొగుడుతున్నారు. టిటిడి ఉద్యోగస్తుల క్రమశిక్షణ, వారి సేవలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.  ప్రపంచవ్యాప్తంగా టీటీడీకి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెస్తున్న వేలాది మంది ఉద్యోగస్తులకు ఆశ్రయం లేదు.  టిటిడి ప్రధాన అర్చకులు, అర్చకులు, మరియు శాశ్వత ఉద్యోగస్తులకు అలిపిరి వద్ద ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. అలిపిరి నుంచి పేరూరు వరకు టిటిడి భూములు ఉన్నాయి. ఆ భూములను టిటిడి ఉద్యోగస్తులకు కేటాయించాలి.  సిమ్స్ హాస్పిటల్ ను నిలబెట్టింది నేను, (చింతామోహన్) డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఏ ప్రభుత్వం. సిమ్స్ లో నిరుపేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలి.  తిరుపతి స్థానికులకు మంగళవారం దర్శనం ఇవ్వడం టిడిపి ప్రభుత్వానికి ఇష్టం లేదా?  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎందుకు ఆపారు?  తిరుపతి ప్రజల ఓట్లు వేయించుకున్నారు. తిరుపతి వాసులకు ఉచిత దర్శనం ఇవ్వరా? టిటిడి మార్కెటింగ్ విభాగంలో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సరుకులు కొనుగోలుపై పారదర్శకత కావాలి. మార్కెటింగ్ విభాగంలో రేట్లు  సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.  తిరుపతి జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ఉన్న పదివేల మంది నిరుద్యోగులకు, నిరుపేద మహిళలకు ఒక్కొక్కరికి 5 పాడి ఆవులు బ్యాంకుల ద్వారా ఇవ్వాలి.  టిటిడి కి అవసరమైన నెయ్యిని, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేయాలి. టిటిడి ఇఓకు సూపర్ 6 డిమాండ్లు పై కాంగ్రెస్ కరపత్రం. దీపావళి లోపు అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపి గౌడ్, రవి, రావణ్, తేజోవతి, శాంతి యాదవ్, ముని శోభ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts