YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆమె దూకుడే.... బలం.. బలహీనత

ఆమె దూకుడే.... బలం.. బలహీనత

కర్నూలు, అక్టోబరు 21,
తండ్రి, తల్లి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆ మహిళా నేత పొలిటికల్ స్టైలే వేరు. ఏ విషయంలో అయినా..ఎంత పెద్దోళ్లు అయినా నో కాంప్రమైజ్. తేడా వస్తే దగ్గరి బంధువులతో కూడా గొడవ పడకుండా ఉండరు భూమా అఖిలప్రియ. తండ్రి మరణం తర్వాత మంత్రి అయిన భూమా అఖిల ప్రియ..2019 ఎన్నికల్లో ఓడిపోయారు.అయినా తగ్గలేదు. హైదరాబాద్‌లో తన భూముల విషయంలో దూకుడుగా వెళ్లి..చివరకు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత తన తండ్రికి ప్రాణమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితోనూ గొడవ పడ్డారు. ఇంత జరిగినా ఆమె మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అయితే మంత్రి పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇలా దూకుడే అఖిలప్రియ బలం, బలహీనత అయిపోయాయి.లేటెస్ట్‌గా మేనమామ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డితో కయ్యానికి దిగి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఉన్నట్లుండి నంద్యాలలోని విజయడైరీకి వెళ్లారు భూమా అఖిలప్రియ. అక్కడ చైర్మన్ ఛాంబర్‌లో మాజీ సీఎం జగన్‌ ఫోటో చూసి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. చంద్రబాబు ఫోటో లేకపోవడం ఏంటంటూ హల్‌చల్‌ చేశారు.విజయ డైరీ ఛైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి కుర్చీలో కూర్చోవడంతో మరింత వివాదం అయింది. దీంతో SV జగన్మోహన్‌రెడ్డి అఖిలప్రియకు ఫోన్ చేసి తన కుర్చీలో కూర్చోవడానికి నువేవరంటూ ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాలడైరీ సాక్షిగా మామ, కోడలు సవాలు చేసుకున్నారు. మీ కుటుంబం కోసం ప్రాణాలు అడ్డుపెట్టి రాజకీయం చేసింది గుర్తులేదా.. నీ రౌడీయిజం ఏమైనా ఉంటే ఆళ్లగడ్డలో చూయించుకో నంద్యాలలో కాందటూ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటూ ప్రతి సవాల్‌ చేశారు.విజయడైరీ ఛైర్మన్ ఛాంబర్‌లో మాజీ సీఎం జగన్ చిత్రపటం ఉండటం చూసి ఎమ్మెల్యే అఖిలప్రియ డైరెక్టర్‌ను నిలదీశారు. ఛాంబర్‌లోని జగన్ ఫోటను తొలగించి సీఎం చంద్రబాబు ఫోటోను స్వయంగా ఎమ్మెల్యే అఖిలప్రియ ఏర్పాటు చేశారు. ఇలా కొత్త రచ్చకు దారితీశారు. అయితే అఖిలప్రియ తన తమ్ముడ్ని విజయడైరీ డైరెక్టర్ చేసేందుకు కొత్త రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి.ఇలా వివాదం ఏదైనా ఆమె మార్క్ రాజకీయమే వేరుగా ఉంటుంది. అయితే ఆమె దూకుడు వైఖరిపై విమర్శలు కూడా ఉన్నాయి. అనవసరంగా ఎవరినీ పడితే వాళ్లను గెలుకుతారని..ఎస్వీ ఫ్యామిలీతో గొడవ పడటం ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డను కాదని నంద్యాలకు వచ్చి పరిస్థితులను డిస్ట్రబ్‌ చేయాల్సిన పనేముందన్న చర్చ జరుగుతోందితండ్రి భూమా నాగిరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ..తండ్రికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి అన్నవాళ్లతోనే నాగిరెడ్డి గొడవ పడేవారని.. భూమా శోభానాగిరెడ్డి అయితే అందరితో మంచి రిలేషన్‌ మెయింటెన్‌ చేసేవారని అంటున్నారు. కానీ అఖిలప్రియ మాత్రం తండ్రి, తల్లికి భిన్నంగా తన ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నవాళ్లను దూరం చేసుకుంటున్నారన్న చర్చ ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజల్లో జరుగుతోంది.రాజకీయాల్లో దూకుడు మంచిదే కానీ..ఆ దూకుడు వల్లే అందరినీ దూరం చేసుకోవడం మాత్రం భవిష్యత్‌కు సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె తీరును కాస్త మార్చుకుంటే రాజకీయంగా ఇంకా నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదిఏమైనా అఖిలప్రియ తీరు మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు.

Related Posts