YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ గ్రామమే చదువుల గ్రామం...

ఆ గ్రామమే చదువుల గ్రామం...

భోపాల్, అక్టోబరు 21,
లక్షల మంది జనాభా ఉన్న పట్టణాల నుంచి ఒకరిద్దరు సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేస్తే అదే గొప్పగా ప్రచారం జరుగుతుంది. కానీ మధ్య ప్రదేశ్‌లో కేవలం ఐదు వేల జనాభా ఉండే పడియాల్  అనే గ్రామంలో మాత్ర యువత చాలా ఈజీగా ఐఏఎస్, ఐపీఎస్ సాధించేస్తూంటారు. ఇప్పటికే ఆ గ్రామం నుంచి వంది మందికిపైకా సివిల్ సర్వీస్ అధికారులు వచ్చారు. మాల్వా రీజియన్‌లో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వారంతా గిరిజనులే. భిల్ అనే కమ్యూనిటీకి చెందిన గిరిజనులు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ తమ బిడ్డలకు మంచి చదువులు చెప్పించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పడియాల్ గ్రామంలో 90 శాతం మంది చదువుకున్నవారు ఉంటారు. వద మంది సివిల్ సర్వీస్ అధికారులే కాదు.. అనేక ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు ఈ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు, వైద్యులు, లాయర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఈ గ్రామం నుంచి  వచ్చారు. భిల్ కమ్యూనిటీకి చెందిన వారు వైద్య పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తూంటారు. ప్రతి ఏడుగురిలో నలుగురు మెడికల్ సీట్లు సాధిస్తూంటారు.  జేఈఈలో వారికి కీలక ర్యాంకులు వస్తూంటాయి. ఈ ఏడాది ఆ ఊరి నుంచి నలుగురు మెడికల్ సీట్లు, ముగ్గురు JEE ర్యాంకులతో మంచి ఐఐటీ కాలేజీల్లో సీట్లు సంపాదించారు.  ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి సగటున ఒక్కరైనా గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత ఈ గ్రామంలోని యువత చదువులపై ఎక్కవగా దృష్టి పెట్టారని..  ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.  గ్రామంలో విద్యా సంబంధిత అంశాల్లో గ్రామస్తులు ఎతో చురుకుగా ఉంటారు. ప్రతి విద్యార్థి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతోనే పని చేస్తూంటారు. స్కూళ్లలో స్మార్ట్ క్లాసులు కూడా జరుగుతూంటాయి. సర్వీస్ నుంచి రిటైరైన వారు ఆ గ్రామంలోని విద్యార్థుల్ని మరింతగా ఉన్నత స్థానానికి చేర్చేందుకు సేవలు అందిస్తూ ఉంటారు.  విద్య, వైద్య రంగాల్లో పడియాల్ గ్రామానికి సేవ చేందుకు పన్నెండు మంది రిటైర్డ్ అధికారులు  ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. అందరికీ కోరుకున్నట్లుగా సివిల్ సర్వీస్ రాకపోయినా కీలక ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొంత మంది విదేశాల్లోనూ ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా యువతకు సూచిస్తోంది

Related Posts