YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త అధ్యక్షుడు ఎవరు.

కొత్త అధ్యక్షుడు ఎవరు.

హైదరాబాద్, అక్టోబరు 21,
తెలంగాణ బీజేపీ చుక్కాని లేని నావలా నడుస్తోంది.  బండి సంజయ్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆయనను తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. అప్పుడూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రే.. ఇప్పుడూ కేంద్రమంత్రే. ఆయన అప్పట్నుంచి  పార్టీని పట్టించుకోలేకపోతున్నారు. మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి , బండి సంజయ్ ప్రమాణాలు చేశాక కొత్త అధ్యక్షుడు వస్తారేమో అనుకన్నారు. కానీ నెలలు గడుస్తున్నా హైకమాండ్ అధ్యక్షుడ్ని నియమించలేకపోయింది. పార్టీ కూడా స్తబ్దుగా మారిపోయిది. ఈ క్రమంలో అంతర్గత కలహాలు మాత్రం మీడియాకు ఎక్కుతున్నాయి. గ్రేటర్‌లో 48 కార్పోరేటర్ సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటే ఎందుకు గెలిచిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గళమెత్తడం బీజేపీలో సంచలనం అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనుకున్న పరిస్థితి నుంచి బీజేపీ 8 సీట్లకేపరిమితవడానికి కారణం ఏమిటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని ాయనంటున్నారు. ఆయన ఎవరిని టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. మరో నేత   ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఆఫీసులో కాకుండా  ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు.  పార్టీ కార్యాలయం, అసెంబ్లీ ఎల్పీలో ఆయనకు చాన్స్ ఇవ్వలేదని అందుకే ప్రెస్ క్లబ్‌లో పెట్టారని చెబుతున్నారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్, డీకే అరుణ తదితరులు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు గడిచి దాదాపు 10 నెలలు అవుతున్నా  కొత్త అధ్యక్షుడిని నియమించికపోవడంతో పార్టీల్లో స్తబ్దత ఏర్పడింది.  ఏకాభిప్రాయం కుదరకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతోంది.  మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సమయం ఇవ్వడం సాధ్యం కావడం లేదని.. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది.  పార్టీ నాయకత్వం మార్చే వరకు బీజేపీలో విభేదాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.హైకమాండ్ కు చెందిన వ్యక్తులు పలుమార్లు తెలంగాణ పర్యటనకు వచ్చినా ఓ నాయకుడ్ని ఖరారు చేయలేకపోయారు. నిజానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఈటల రాజేందర్ ను అధ్యక్షుడిగా ప్రకటించడానికి రంగం సిద్ధమైపోయిందని అనుకున్నారు. కానీ అదంతా తేలిక కాదని వెంటనే అర్థమైపోయింది. ఆయనకు వ్యతిరేకంగా బలమైన లాబీనే ఉందని స్పష్టమయింది. మల్కాజిగి టిక్కెట్ ఆయనకు రాకుండా చాలా మంది ప్రయత్నించారు. అయితే బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన టిక్కెట్ తెచ్చుకోగలిగారు. బీసీ సీఎం నినాదం కూడా ఈటలే ఇప్పించారని అంటారు. అంతగా తనపై నమ్మకం పెట్టుకున్న  హైకమాండ్ .. తనకు చీఫ్ గా చాన్స్ ఇస్తుందనిఅనుకుంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. అందుకే ఆయన బీజేపీ పేరుతో కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా బీజేపీ ఎంపీగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. మూసీ విషయంలో ఆయన సొంతంగానే పర్యటించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా త్వరలో అధ్యక్షుడ్ని నియమించాలని బీజేపీ క్యాడర్ కూడా కోరుకుంటోంది.

Related Posts