రాష్ట్రంలో హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని వివిధ పీఠాధిపతులు ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్రంలోని వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతుల ధార్మిక సమ్మేళనం తిరుపతిలో జరిగింది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటమే తమ అజెండా అని వారన్నారు. హంపి పీఠాధిపతి విధ్యానంద భారతి మాట్లాడుతూ గత కొద్దీ రోజులుగా టీటీడీ లో జరుగుతున్న పరిణామాలపై ఈరోజు మఠాధిపతులు, పీఠాధిపతులు సమావేశం అయ్యామని వివరించారు. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చించామన్ఆనరు. టీటీడీ లో అనువంశిక అర్చకులను కొనసాగించాలి. అలాగే వంశ పారిపర్యంగా వచ్చే వారిని తొలగించరాదన్నారు. ధార్మిక పరిషత్ యొక్క సలహాలు టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి. స్వామివారి ఆభరణాల విషయంలో ఒక కమిటీ వేసి నిజానిజాలు తేల్చలని అన్నారు. టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలలో ఉన్న అన్యమతస్థులను వేరే ప్రాంతాలకు తరలించాలి. . దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయం ఆలయాల పరిరక్షణకే ఉపయోగించాలని అన్నారు. ఈ డిమాండ్ లను ప్రభుత్వానికి పంపుతాం. మా డిమాండ్ లపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నామని స్వామిజీ అన్నారు. ఈ సమావేశం ఏ పార్టీకి సంబంధించింది కాదని స్పష్టం చేసారు.