YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది
- వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామన్న మూవీ టీం
- ఈనెల 25న సినిమా బ్రహ్మాండమైన విడుదల
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్  ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సుమన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మరియు సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ గారు పాల్గొన్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు, సుమన్ గారు, కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.
"మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సముద్రమే వారి జీవనాధారం, అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం. ఈ చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర గారు మాట్లాడుతూ : సముద్రుడు టైటిల్ దర్శకుడు నగేష్ నన్ను చూసి పెట్టడం జరిగింది. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాటని నిజం చేస్తూ ఈరోజు రమాకాంత్ హీరోగా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నగేష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకులు సక్సెస్ రూపంలో ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : మొదటి సినిమానే మైథాలజికల్ సినిమా తీసిన దర్శకుడు నగేష్. ఇది తనకి 12వ సినిమా. అదేవిధంగా తన స్నేహితుడు దర్శకుడు సముద్ర తనకే సపోర్టుగా ఉండడం మంచి విషయం. దర్శకుడుగా దర్శకత్వం ఒకటే కాకుండా 24 శాఖల పైన పట్టు సాధించి నిర్మాతకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రమోషన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చూసుకున్న వ్యక్తి నగేష్. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ముఖ్యంగా సుమన్ గారు తన సినిమాగా భావించి ప్రతి ఈవెంట్లో ప్రమోషన్స్లో పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయం. సినిమా చేయడం ఒకటే కాదు ప్రమోషన్స్, రిలీజ్ వరకు కూడా దాని బాధ్యతలు తీసుకున్న వాళ్లే గొప్పవాళ్లు అని చెప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Related Posts