గుంటూరు, నవంబర్ 1,
వైసీపీని వీడే ఆలోచనలో ఆ మాజీ మంత్రి. ఈ మధ్య జంప్ అయిన నేతలతో లాభియింగ్.. ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఆ పార్టీ అధినేత. బాబు గారి శిష్యురాలిని అని చెప్పుకున్నారు. ఆయన నాటిన మొక్కను అని గర్వంగా గర్జించారు. తర్వాత జగనన్న ఆదరించిన ఆడపడుచునని సంబరపడిపోయారు. ఐదేళ్లు అధికార పార్టీలో వెలిగిపోయి బీసీ మహిళ నేతగా, మంత్రిగా పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కించుకుని తన దారి తాను వెతుక్కుంటున్నారట ఆ మాజీ మంత్రి. తగిన గుర్తింపు ఇచ్చిన జగన్‌కు పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట మాజీ మంత్రి చిలకలూరు మాజీ ఎమ్మెల్యే విడుదల రజని.ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కంటే అధికార పార్టీలో ఉండడమే బెటర్ అని అనుకుంటున్నారట. అందుకే జనసేన కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ మారాలని ప్రయత్నాలు బిజీగా ఉన్నారట. విడుదల రజిని అందుకు ఇన్నాళ్లు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆమె ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.మొదట్లో విడుదల రజిని బీజేపీలోకి వెళ్తారు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె జనసేన గూటికి చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. అయితే, ఈ మధ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరడంతో విడుదల రజిని జంపింగ్ ఆశలు మళ్లీ చిగురించాయని తెలుస్తోంది. ఆయన ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే బాలినేని వైసీపీని వీడెందుకు ముందు విడుదల రజిని ఆయనతో సమావేశమయ్యారు.పార్టీ వీడియోద్దని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే, బాలినేని పార్టీ వీడుతారని విడుదల రజినీకి ముందే తెలుసని ఆయనతో పాటే జంప్ కావాలని భావించారని విడుదల రజనిని జాయిన్ చేసుకునేందుకు పవన్ సిద్ధంగా లేరని అంటున్నారు. బాలినేని చేరికకే అన్ని ఆలోచించారని చర్చ ఉంది. అందుకే విడుదల రజిని జాయిన్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఈ ప్రచారం జరుగుతోంది. అయినా జనసేనాని ఒప్పించేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారట విడుదల రజిని.గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు రాజకీయ పరిస్థితులు అవినీతి ఆరోపణలతో జంపింగ్ సరైన నిర్ణయం అని భావిస్తున్నారట విడుదల రజిని. రజిని విషయంలో పవన్ అంత పాజిటివ్‌గా లేనట్టు చెప్తున్నారు జనసేన నేతలు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే చేర్చుకుంటామని అంటున్నారట. రజనీపై ఉన్న అవినీతి ఆరోపణలు వివాదాలతో ఆమెను చేర్చుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారుసైబరాబాద్‌లో నాటిన మొక్కను సార్ అంటూ ఏపీ పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన విడుదల రజిని వైసీపీలో చేరాక ఎమ్మెల్యేగా మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తిన రజిని వైసీపీలో కూడా జగన్‌పై అంతే స్థాయిలో వీరవిధేయత చాటుకునేవారు. ఈ క్రమంలో రెండున్నరేళ్లపాటు మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. గెలిచిన తొలిసారి మంత్రి అయిన రజిని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అంతకుమించిన వివాదాల్లో చిక్కుకున్నారు.అవినీతి ఆరోపణలపై పోలీసు కేసులు నమోదు కావడంతో జనసేనలోకి జంప్ సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి 16 లక్షల రూపాయలను కమిషన్ గా తీసుకున్నారని విడుదల రజినీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగి ఇచ్చేసారని చెబుతున్నారు. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజిని.ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తాను అని అప్పటి వైసీపీ ఇన్చార్జి మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్ కు కొంత మొత్తం తిరిగి ఇచ్చిన ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజేష్ నాయుడు ఓవైపు వెంటాడుతూ ఉండగా మరో వైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ల యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తమ క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు తనకు ఇవ్వాలని రజిని డిమాండ్ చేశారని లేదంటే 50 కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించాలని ఆరోపించారు.దీంతో ఈ కేసులో రజనీపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడుదల రజిని అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్ లో పడిపోయారట. కేసులు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ ఏ సరైన మార్గం అనుకుంటున్నారట. విడుదల రజిని ఎన్నాళ్ళని సైలెంట్‌గా ఉంటాం. జనసేన గూటికి చేరి సేఫ్ జోన్ లో ఉంటే ప్రశాంతతైన దక్కుతుందని అనుకుంటున్నారట మాజీ మంత్రివర్యులు.