YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పైనో రైలు...కిందో రైలు...

పైనో రైలు...కిందో రైలు...

వరంగల్, నవంబర్ 1,
దేశ రాజధాని ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే వై ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. ఇది కిలోమీటరు దూరం. మరోవైపు వెళ్తే వరంగల్‌ స్టేషన్‌. ఇది 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఢిల్లీ - సికింద్రాబాద్‌ రైళ్లు కాజీపేట మీదుగా.. ఢిల్లీ - విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ రద్దీగా మారుతుంది. రద్దీ సమస్యను తగ్గించడానికి రైల్వేశాఖ వినూత్నంగా ఆలోచించింది. రైల్‌ అండర్‌ రైల్‌ వంతెన నిర్మాణం చేపట్టింది. రూ.125 కోట్ల వ్యయంతో, 21.47 కి.మీ. మేరకు భూగర్భ మార్గాన్ని నిర్మిస్తున్నారు. కోమటిపల్లి నుండి వడ్డేపల్లి చెరువు వరకు, భూగర్భంలో 340 మీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. కోమటిపల్లి దగ్గర భూఊపరితలం నుండి రైలు మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. అండర్‌గ్రౌండ్‌లో సుమారు 340 మీటర్లు ప్రయాణం చేసి, ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితలానికి చేరుకుంటుంది. ఈ బైపాస్‌ పూర్తయితే హసన్‌పర్తి రోడ్‌ నుంచి అటు వరంగల్‌ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించొచ్చని అధికారులు తెలిపారు. బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్‌ వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్‌ సమస్యలు తీరిపోతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.ఈ బైపాస్ నిర్మాణం అద్బుతంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ నిర్మాణాన్ని చూడటానికి త్రినగరి ప్రజలు వస్తున్నారు. ఒకేసారి పైనొక రైలు.. కిందకొ రైలు వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ట్రైయల్ రన్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Related Posts