YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మొండికేస్తున్న మిల్లర్లు మొదలుకాని కొనుగోళ్లు

మొండికేస్తున్న మిల్లర్లు మొదలుకాని కొనుగోళ్లు

హైదరాబాద్
ఓ వైపు వర్షాలతో రైతుల్లో బుగులు
రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లకు ఇప్పటికి మొదలైనవి 4,598 కేంద్రాలే
మిల్లర్లతో పూర్తికాని చర్చలు, రైతుల ఎదురుచూపులు
హైదరాబాద్ రాష్ట్రంలో ధాన్యం దింపుకోవడానికి మిల్లర్లు మొండికేస్తుండడంతో చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు షురూ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకూ 4,598 సెంటర్లు మాత్రమే చాల్ అయ్యాయి. మొదలైన సెంటర్లలోనూ కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు. సర్కారు తీసుకువచ్చిన కొత్త పాలసీ మిల్లర్లకు మింగుడుపడడం లేదు. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అక్రమార్కులు ఇప్పుడు కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో ధాన్యం దింపుకోవడానికి సుముఖత చూపించడం లేదు. ధాన్యం కేటాయించాలంటే క్లీన్చిట్ ఉండడంతో పాటు బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలనే నిబంధన వారి ఆగడాలకు అడ్డంకిగా మారింది.

మొండికేస్తున్న మిల్లర్లు:
మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సిందేనని ప్రభుత్వం కొత్త పాలసీలో స్పష్టం చేసింది. గతంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్,  ఇచ్చిన విధానాన్ని బట్టి గ్యారంటీలను సమర్పించేలా నిర్ణయం తీసుకున్నది. సీఎంఆర్ టైంకు ఇచ్చిన మిల్లర్లకు వారికి అప్రూవల్ అయిన మిల్లింగ్‌ కెపాసిటీకి తగ్గట్టుగా ధాన్యం మద్దతు ధర ఆధారంగా 10 శాతం బ్యాంక్‌ గ్యారంటీ కానీ లేదా రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 25 శాతం విలువైన సెక్యూరిటీ డిపాజిట్‌కానీ చెల్లించాలని షరతు పెట్టింది.
అలాగే, సీఎంఆర్ పెండింగ్‌లో ఉండి డిఫాల్టర్గా మారి పెనాల్టీతో సహా క్లియర్‌చేసిన మిల్లర్లకు 20 శాతం బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించాలని లేదా అప్రూవ్డ్ మిల్లింగ్ కెపాసిటీలో 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని కండిషన్ ఉన్నది. డిఫాల్టర్గా ఉండి పెండింగ్‌ సీఎంఆర్ క్లియర్‌చేసి 25శాతం పెనాల్టీ పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టిన మిల్లర్లకు పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ ధాన్యానికి 25 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలని, మిల్లింగ్‌అప్రూవ్డ్ కెపాసిటీలో 25 శాతం అదనంగా మరో బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త పాలసీలో స్పష్టం చేసింది. ఇక డిఫాల్ట్మిల్లర్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. అయితే, ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రెండు, అంతకంటే ఎక్కువ సార్లు డిఫాల్ట్ అయిన మిల్లులు దాదాపు 386 ఉన్నట్టు తెలుస్తున్నది.
కొనుగోళ్లలో వేగం పుంజుకోలే,
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,598 కొనుగోలు సెంటర్లు తెరిచారు. అయితే చాల్ అయిన సెంటర్లలోనూ కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ధాన్యం దింపుకునేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇవి ఇంకా కొలిక్కి రాకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. ఈసీజన్లో ఇప్పటికే వడ్లు వచ్చే జిల్లాలు అయిన నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో చర్చలు కొలిక్కి రాలేదు.
జిల్లాల వారీగా పరిస్థితి ఇది, మెదక్ జిల్లాలో
మెదక్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంకా ధాన్యం కొనుగోళ్లు షురూ కాలేదు. జిల్లాలో మొత్తం 104 రైస్ మిల్లులు ఉండగా. గడిచిన సీజన్లలో సీఏంఆర్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించారు. కేవలం 44 మిల్లులకు మాత్రమే అర్హత ఉన్నదని తేల్చారు. కాగా ఆ మిల్లర్లు సైతం తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని చెబుతున్నారు. మిల్లర్లతో అధికారులు జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కారణంగా ధాన్యం కాంటా పెట్టడం లేదు. దీంతో వారం, పది రోజులుగా రైతులు కేంద్రాల వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మరోవైపు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలు జలమయమై పెద్ద మొత్తంలో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడం రైతులకు కష్టమవుతున్నది.

Related Posts