ఇబ్రహీంపట్నం
మూలపాడు గ్రామంలో గల గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియాన్ని ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని సోమవారం ఉదయం సందర్శించారు. క్రికెట్ స్టేడియంలో గల అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్, యు స్టోర్ రూముల శుభ్రత గా ఉండాలని స్టేడియం మేనేజర్ల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తరువాత మీడియాతో మాట్లాడిన కేసినేని శివనాద్ మూలపాడు క్రికెట్ స్టేడియం కు త్వరలో మంచి రోజులు రానున్నాయని ప్రస్తుతం ఉన్న రెండు క్రికెట్ స్టేడియం లే కాకుండా అదనంగా మరొక పిచ్ ను కూడా ఏర్పాటు చేయటానికి అధికారులతో సంప్రదింపులు చేశామన్నారు. మూలపాడు వాసులకు మరో శుభవార్త చెప్పిన ఎంపీ కేసినేని శివనాథ్ త్వరలో మూలపాడు గ్రామానికి మరో క్రొత్త క్రీడను తీసుకురాబోతున్నామని అదే గోల్ఫ్ కోర్టు అన్నారు దీనివల్ల ఇబ్రహీంపట్నం మండలంలోని దాదాపు 400 ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందిఅన్నారు. స్టేడియం కు వచ్చే రోడ్లను విస్తృతపరచాలని అందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఆదేశించారు ఈ మేరకు స్థానిక నాయకులు మూలపాడు క్రికెట్ స్టేడియం కి రావడానికి సుమారు మూడు దారులు ఉన్నాయని వాటిని అధికారులు ఆదేశిస్తే త్వరలో పూర్తిచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రీడాకారులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నామన్నారు