YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

ఒంట్లో కొవ్వు పేరుకుపోతే రొమ్ము కేన్సర్...?

 ఒంట్లో కొవ్వు పేరుకుపోతే రొమ్ము కేన్సర్...?

శరీర ఎత్తుకు తగ్గ బరువు ఉన్నా కూడా మహిళలకు వ్యాయామం అవసరమేనని తాజా పరిశోధన స్పష్టంచేసింది. బాగానే ఉన్నామని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కొవ్వు పేరుకుపోయి రొమ్ము కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సూచించిన పరిధిలోనే బరువు ఉందంటే శరీరంలో కొవ్వులేదన్నట్లు కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీఎంఐ ఓ సంప్రదాయక, విశ్వసనీయమైన కొలతే.. ఐతే, ఎత్తుకు తగ్గ బరువును లెక్కించే క్రమంలో శరీరంలోని కొవ్వును మొత్తంగా లెక్కిస్తుందని, అది తప్పని పేర్కొన్నారు.



శరీరంలోని ఎముకల సాంద్రతను, కొవ్వును వేర్వేరుగా చూడాలని చెప్పారు. ఈమేరకు బీఎంఐ నార్మల్‌గా ఉన్న 3460 మందిని ఎంపికచేసి 16 సంవత్సరాల పాటు వారిపై అధ్యయనం జరపగా.. అందులో 182 మంది రొమ్ము కేన్సర్ బారిన పడ్డారని తెలిపారు. వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడమే కేన్సర్ రాకకు కారణమని తేలిందన్నారు. దీంతో బీఎంఐ నార్మల్‌గా ఉన్నా కూడా మహిళలు వ్యాయామం చేయాల్సిందేనని స్లోఅన్ కెట్టెరింగ్ కేన్సర్ సెంటర్‌కు చెందిన నీల్ అయ్యంగార్ పేర్కొన్నారు.

Related Posts