న్యూయార్క్, నవంబర్ 8,
బలహీనుడి వెనుక బలవంతుడు ఉండటం ఆనవాయితీయే. ఫర్ ఏ ఛేంజ్.. ఈసారి బలవంతుడి వెనుక బలవంతుడే ఉన్నాడు. కట్ చేస్తే విజయం కొత్త రికార్డ్ చూసింది. ట్రంప్ విజయం వెనుక వినిపిస్తున్న మాట ఇది. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్క్. ఏ కష్టమైనా తనను దాటుకునే రావాలి అన్నట్లుగా ట్రంప్ ముందు కోటలా నిలిచిన మస్క్.. ఇప్పుడు అమెరికాలో పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఇంతకీ మస్క్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ క్యాబినెట్ లో ఆయన రోల్ ఎలా ఉండబోతోందివ్యాపారవేత్త ఆలోచన వెనకే కాదు ఖర్చుల వెనక అడుగుల వెనుక కూడా వ్యాపారమే ఉంటుంది. అలాంటిది ట్రంప్ అధ్యక్షుడిగా గెలవాలని మస్క్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ట్రంప్ గెలవాలని మస్క్ కు ఎందుకు ఇంత పట్టుదల? ఆయన ఏం కోరుకుంటున్నారు? వైట్ హౌస్ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ఈ సపోర్ట్ వెనుక మస్క్ భారీ స్ట్రాటజీ ఉందా? అమెరికాను మస్క్ శాసించడం ఖాయమా?ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్.. అమెరికా అడ్మినిస్ట్రేషన్ లోనూ కీ రోల్ ప్లే చేయడం ఖాయం. తన క్యాబినెట్ లో మస్క్ కు కీలక హోదా కల్పిస్తామని ట్రంప్ చెప్పేశారు. అదే జరిగితే ఫెడరల్ ఆపరేషన్స్ లో కొత్త శకం మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికారంలోకి వస్తే 2 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చని మస్క్ సూచించారు. ఎన్నికల ముందు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు కూడా. అయితే, గవర్న్ మెంట్ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతిగా మస్క్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే ఫెడరల్ ప్రభుత్వం నుంచి తన కంపెనీలకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు మస్క్ కు అవకాశం దక్కినట్లే అన్నది మెజార్టీ వర్గాల అభిప్రాయం. ట్రంప్ ను ముందు పెట్టి వెనకాల మస్క్ చక్రం తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.