అమరావతి
ఆర్ధిక నేరగాళ్ళ నుంచి ఆకు రౌడీల దాకా, రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం. జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని హోం మంత్రి అనిత అన్నారు.
మన రాష్ట్ర పరువు, ప్రతిష్ఠను జగన్ ఎప్పుడో తీసేశారు.ఐదేళ్ల పాలనలో ఏం చేశారనే దానిపై జగన్ మాట్లాడాలి.వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు చూడండి. ఎన్ని నేరాలు జరిగినా జగన్ ఐదేళ్లపాటు మాట్లాడలేదు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా జగన్ పట్టించుకోలేదు. ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అనేకమందిపై కేసులు పెట్టారు. బూతులు మాట్లాడే వాళ్ళ పై కేసులు పెడుతుంటే, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అంటాడు. 70 ఏళ్ళ రంగనాయకమ్మ గారు నీ అసమర్ధత ప్రశ్నిస్తే అరెస్ట్ చేసావ్. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. దుర్గమ్మ గుడికి వెళ్లకుండా ఎలా అడ్డుకున్నారో చూశాం. డీజీపీ ఆఫీసు పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదని అన్నారు.
జగన్ హయాంలో పరదాలు కట్టుకుని సమావేశాలు పెట్టుకున్నారు. నువ్వు మాట్లాడుతున్నావా జగన్ ? చీకటి రోజులు అంటే ఏంటో తెలుసా జగన్ రెడ్డి ? మా అక్కని ఏడిపిస్తున్నారు అంటే, ఒక చిన్న కుర్రాడిని తగలబెట్టేసారు చూడు. అవి చీకటి రోజులు అంటే. కనీసం ఒక ఎంక్వయిరీ చేసావా జగన్ ? సోషల్ మీడియా గురించి నువ్వు మాట్లాడుతున్నావా జగన్ ? సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మర్చిపోయావా ? గౌతు శిరీష, చింతకాయల విజయ్, రంగనాయకమ్మను ఇబ్బంది పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏమిటో జగన్కి తెలుసా ? జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు.
తన తల్లి, చెల్లి జోలికి ఎవడైనా వస్తే, మనిషి అనేవాడు లాగి పెట్టి కొడతాడు. అలాంటిది విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టినా, జగన్ పట్టించుకోలేదు. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. మమ్మల్ని మీరు పెట్టిన బాధలు సమాజానికి తెలియాలి. నాపై, నా రాజకీయ జీవితంపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దారుణంగా పెట్టిన పోస్టులు తట్టుకోలేకే కొందరిని అరెస్టు చేస్తున్నాం. నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టిస్తుంటే, మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ? ఇలాంటి వాళ్ళని వదిలేయాలా ? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.. లోపల వేస్తామని అన్నారు.
ఇలా బూతులు పోస్టు చేసే వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. సభ్యత, సంస్కారం లేనివారిని వార్రూమ్ పెట్టి మరీ రక్షిస్తారా. ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ల భాష గురించి మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డొస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా ఊరుకోం. ప్రతి ఒక్కడి సంగతి తేలుస్తాం.పోలీసులు తలెత్తుకుని విధులు నిర్వహించేలా చేస్తాం. నేరగాళ్లు అనుక్షణం భయపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.