YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భక్తి శ్రద్దలతో చట్ పూజలు

భక్తి శ్రద్దలతో చట్ పూజలు

కొమురం భీమ్
కాగజ్నగర్ పట్టణంలొ ఉత్తర భారతీయులు ప్రతీ సంవత్సరం ఛట్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ భక్తులు ఈ పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఛట్ పూజలు జరుగుతాయి.  కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఇవి ఘనంగా ప్రారంభమయ్యాయి. కొలను వద్ద దీపాలు వెలిగించి నైవేద్యంగా పండ్లు సమర్పించారు. సూర్యాస్తమయం అయ్యే వరకు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకుండా ఉపవాసంతో పూజలు నిర్వహిస్తారు. ఇంటిళ్లిపాదితోపాటు లోక కల్యాణం కోసం ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మహిళలు పేర్కొన్నారు. ఈ పూజ నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు నహాయ్ ఖాయ్, రెండోరోజు ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ట్స్, నాలుగవరోజు పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరికాయ, అరటిపళ్లు, పసుపు, అల్లం ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.

Related Posts