YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు

బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు

విజయవాడ, నవంబర్ 11,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. జగన్ నేతలను కలుపుకుని వెళ్లడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఉన్నారు. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయన ఏదీ నేతలతో పార్టీ విషయాలను ముందుగా పంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. అసలు వైసీపీకి ఒక పార్టీ కార్యవర్గం ఉందా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాల్సింది. జగన్ రెండు విషయాలను ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చి మరొకసారి తాను ఇంతేనని నిరూపించుకున్నారు. పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది. తలపండిన సీనియర్ నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న నేతలు కూడా ఉన్నారు. వారందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మాత్రం ఫ్యాన్ పార్టీలో లేదు. అదే అనేక మంది నేతలకు రాజకీయంగా ఇబ్బందిగా మారింది. పార్టీలో ఉండకపోవడానికి కూడా అదే ప్రధాన కారణంగా చూపుతున్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జగన్ ఇంకా మానుకోవడం లేదు. జగన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఆయనలోని ఏకపక్ష వ్యవహారశైలికి అద్దం పట్టాయి. 1. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం. 2. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించిందంటే తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పి తప్పుకుంది. కానీ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే టీడీపీకి ఊపిరి వచ్చిందన్న విషయాన్ని వైసీీపీ అధినేత మర్చిపోయినట్లున్నారు. ఎన్నికకు జగన్ సిద్ధంగా లేరన్న సంకేతాలు ఈ నిర్ణయంతో ఇచ్చినట్లయింది.అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదుర్కొంది వైసిపి. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఇంకా జగన్ తప్పుడు అడుగులు వేస్తూనే ఉన్నారు. తాజాగా అటువంటి రెండు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఆ పార్టీ ఎదుర్కొంటోంది.2014లో అధికారంలోకి రాకపోయినా బలమైన పార్టీగా పునాదులు వేసుకుంది వైసిపి. ఆ పార్టీ నుంచి 23 మంది టిడిపిలోకి ఫిరాయించినా లెక్క చేయలేదు.వెన్ను చూపలేదు.అదే దూకుడుతో ముందుకు సాగింది.అధికార పక్షం పై ఫైట్ చేసింది.అంతులేని విశ్వాసంతో 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి అధికారాన్ని అందుకుంది. కానీ 2024 ఎన్నికల్లో అధికారాన్ని పదిల పరుచుకోవాలని చూసింది. కానీ నిరాశ ఎదురయింది. దారుణ ఓటమిని మూటగట్టుకుంది.అయితే గత అనుభవాల దృష్ట్యా పోరాట బాట పట్టాల్సిన జగన్.. తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారు జగన్.అంతటితో ఆగకుండా శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు.దీనిపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆందోళన చెందుతున్నాయి.అధినేత తీరు మారకపోతే కష్టమని పెదవి విరుస్తున్నాయ ఇక మరో నిర్ణయం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం. పదకొండు మంది సభ్యులున్నప్పటీకీ వారితో మాట్లాడి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2024 శాసనసభ ఎన్నికల్లో పదకొండు మంది మాత్రమే గెలిచారు. అయినా గెలిచిన వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వారితో ఏమాత్రం సంప్రదించకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నామని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ ఎస్కేప్ అవుతున్నారని.. శాసనసభలో గత అనుభవాల దృష్ట్యా తనకు అవమానాలు ఎదురవుతాయని భావిస్తున్నారని.. అందుకే బహిష్కరిస్తున్నారని అధికార పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ప్రజల్లోకి సైతం అది బలంగా వెళ్తోంది. వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకు అదే కారణం అవుతోంది. అధినేత తీరుపై సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా ఈ నిర్ణయం కొంత అసంతృప్తికి దారి తీసేలా ఉంది. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts