YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి

కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి

అనంతపురం, తిరుపతి, నవంబర్ 11,
రాయలసీమ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడ్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ముందుగా బావబామ్మర్దులు తమ నియోజకవర్గాల్లో అంతా సెట్‌ చేసి పెట్టారు. ఏ టైమ్‌లోనైనా పీఠం తమ వశం చేసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సెగ్మెంట్‌లోని కుప్పం మున్సిపాలిటీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఛైర్మన్‌ పీఠం కోసం టీడీపీ..తమ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అందులో నుంచి మరో కౌన్సిలర్‌ తిరిగి వైసీపీకి లోకి వెళ్లారు. లేటెస్ట్‌గా కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ అన్ని పదవులకు రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే సుధీర్‌కు సంబంధించి మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామానే పరిగణలోకి తీసుకున్నారు. కౌన్సిలర్‌ పదవికి రాజీనామాను మున్సిపల్ కమిషనర్‌ కన్సడర్‌ చేయలేదు. అయితే సుధీర్‌తో రాజీనామా చేయించి..గతంలో టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఉన్న నేత భార్యకు అవకాశం కల్పించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి 11, వైసీపీకి 14మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే తమ సభ్యులు చేజారిపోకుండా ఎమ్మెల్సీ భరత్‌, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక హిందూపురంలో బాలయ్య ప్లాన్ వర్కౌట్ అయింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మ్యాజిక్ ఫిగర్ దాటింది టీడీపీ. క్యాంపులో 22 మంది టీడీపీ కౌన్సిలర్లు, చైర్మన్ ఎన్నిక రోజున  హైదరాబాద్‌ నుంచి నేరుగా హిందూపురానికి రానున్నారు. హిందూపురంలో మొత్తం 38 వార్డులు ఉండగా 22 మంది కౌన్సిలర్ల మద్దతు టీడీపీకి ఉంది.ఇప్పటికే హిందూపురంలో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న ఇంద్రజ రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. 22 మంది కౌన్సిలర్లు రెండు రోజుల క్రితం క్యాంప్‌కు వెళ్లారు. కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున నేరుగా  హైదరాబాద్ నుంచి హిందూపురంకు వచ్చి సంఖ్యాబలం నిరూపించుకుంటామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉండగా 30మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. ఆరుగురు టీడీపీ తరపున గెలిచారు. ఒకరు బీజేపీ, మరొకరు ఎంఐఎం నుంచి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీడీపీ సంఖ్యాబలం 6 ఉండగా వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు మరో 9 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి టీడీపీ సంఖ్యాబలం 22కు చేరింది.ఈ క్రమంలోనే నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీలో చేరి తమకే ఛైర్మన్ పీఠం ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ముందు డిమాండ్లు పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం పెద్దలు మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి ఆసక్తి చూపలేదు. వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోకపోవడం, నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారింది. పార్టీ పవర్‌లో లేకపోవడంతో మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 22 మంది మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అటు కుప్పం..ఇటు హిందూపురం రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసే ప్లాన్ చేస్తుంది టీడీపీ. రాయలసీమ జిల్లాల్లోని మున్సిపాలిటీలను కైవలం చేసుకుని..వైసీపీ షాక్‌ ఇచ్చేందుకు వర్కౌట్‌ చేస్తోంది. అందులో భాగంగా ముందు హిందూపురం..తర్వాత కుప్పం..ఆ తర్వాత మిగతా మున్సిపాలిటీల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts