YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ,,,

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ,,,

వరంగల్, నవంబర్ 11,
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పేరిట తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై ఈ సర్వేలో సమాచారాన్ని సేకరించనుంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అయితే, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరులకు సంబంధించి కులాలవారీగా సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే కులగణన ముఖ్య ఉద్దేశం. కులాల వారీగా తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేయడమే ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలతో పాటు, కులగణన కూడా చేయడం కూడా సులభం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు అంధించడంలో మార్గం సుగమమం అవుతుంది. అయితే దీన్ని ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై, సర్వేపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు ప్రశ్నల జాబితాను ప్రభుత్వం ముందే ప్రకటించింది. దానికి ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పనిలేదని అధికారులు, మంత్రులు స్పష్టం చేశారు. అయితే సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు.. సులువుగా తమ పని జరగడం కోసం, రికార్డుల ఎంట్రీ ఈజీ అవడంకోసం డాక్యుమెంట్లు చూపించాలని కోరారు. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న జనాలు ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. దీన్నే అదునుగా చేసుకున్న బీఆర్ఎస్ నేతలు.. దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.నిజానికి 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే ఇప్పుడు సర్వే జరుగుతుంది. దాదాపుగా అప్పుడు అడిగిన ప్రశ్నలే.. ఇప్పుడూ అడుగుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వే ద్వారా కులగణన, హామీల అమలుకేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి సర్వేనే చేసి.. కుటుంబాల వివరాలన్నీ సేకరించారు. కానీ ఆ సర్వే ఏమైందో… ఆ వివరాలతో ఏం చేశారో.. రికార్డులు ఎక్కడ పొందుపరిచారో మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అయితే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్న వారు.. తమ హయాంలో చేసిన సర్వే వివరాలతో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts